Breaking News

మామ ఆస్తి నుంచి వితంతువుకు భరణం

Published on Wed, 01/14/2026 - 08:12

న్యూఢిల్లీ: మామ మరణం తర్వాత ఆయన ఆస్తి నుంచి భరణం పొందే హక్కు హిందూ దత్తత, పోషణ చట్టం (హెచ్‌ఏఎంఏ)–1956 ప్రకారం వితంతువుకు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్, జస్టిస్‌ ఎన్‌వీఎన్‌ భట్టి ధర్మాసనం మంగళవారం ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. సదరు మహిళ భర్త ఆమె మామగారి కంటే ముందు మరణించాడా, లేదా తర్వాతా అనేదానితో ఇందుకు నిమిత్తం లేదని కోర్టు స్పష్టం చేసింది. ‘‘చట్టప్రకారం ఇంట్లోని డిపెండెంట్స్‌ అందరి పోషణ బాధ్యతా మరణించిన వారి వారసులపై ఉంటుంది. 

మృతుని నుంచి సంక్రమించిన ఆస్తుల నుంచే వారిని పోషించాల్సి ఉంటుంది. హిందూ దత్తత, పోషణ చట్టం (హెచ్‌ఏఎంఏ)–1956లోని సెక్షన్‌ 21 (7) ప్రకారం మృతుని వితంతు కోడలు డిపెండెంటే అవుతుంది. ఆ ప్రకారం 22వ సెక్షన్‌ కింద ఆమె మెయింటెనెన్స్‌కు హక్కుదారే అవుతారు’’అని తీర్పు రాసిన జస్టిస్‌ మిత్తల్‌ స్పష్టం చేశారు. ‘‘కుమారుడు మరణిస్తే కోడలి పోషణ మామగారి ధారి్మక విధి. స్వయంగా లేదా మరణించిన భర్త వదిలి వెళ్లిన ఆస్తి ద్వారా ఆమె తన పోషణ బాధ్యతలు చేసుకోలేనప్పుడు ఇది మరింతగా వర్తిస్తుంది’’అని పేర్కొన్నారు. 

మహేంద్రప్రసాద్‌ అనే వ్యక్తి 2021 డిసెంబర్‌లో మరణించాడు. తర్వాత రెండేళ్లకు ఆయన కుమారుడు రంజిత్‌ శర్మ మరణించగా మామగారి ఆస్తి నుంచి మెయింటెనెన్స్‌ కోరుతూ ఆయన భార్య గీత ఫ్యామిలీ కోర్టులో కేసు వేసింది. మామ మరణించినప్పుడు గీత వితంతువు కాదంటూ కేసును కోర్టు కొట్టేయడంతో ఆమె హైకోర్టుకు వెళ్లారు. అక్కడ ఆమెకు అనుకూలంగా తీర్పు రావడంతో అత్తింటివారు దాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేశారు. హైకోర్టు తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా తీర్పు వెలువర్చింది.    

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)