Breaking News

ఆ రాష్ట్రంలో యువతుల వివాహ వయస్సు పెంపు

Published on Wed, 08/28/2024 - 09:56

దేశంలో యువతుల వివాహ వయస్సు 18గా ఉంది. అంటే వారికి చట్టప్రకారం 18 ఏళ్లు నిండిన తర్వాతనే వివాహం చేయాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనను హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం సవరించింది.

హిమాచల్ ప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రంలో 21 ఏళ్ల వయస్సు వచ్చాకనే ఆడపిల్లలకు వివాహం చేయాలనే నిబంధనను తీసుకురానుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర అసెంబ్లీ తాజాగా యువతుల వివాహ వయస్సును 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ రూపొందించిన బిల్లుకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర అసెంబ్లీ బాల్య వివాహాల నిషేధాన్ని (హిమాచల్ ప్రదేశ్ సవరణ బిల్లు 2024) వాయిస్ ఓటు ద్వారా ఆమోదించింది.

ఈ సందర్భంగా మహిళా సాధికారత శాఖ మంత్రి ధని రామ్ షాండిల్ మాట్లాడుతూ బాల్య వివాహాలను నిషేధించేందుకు బాల్య వివాహ చట్టం 2006ను రూపొందించామని తెలిపారు. లింగ సమానత్వం, ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలు కల్పించేందుకు యువతుల కనీస వివాహ వయస్సును పెంచాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. చిన్న వయస్సులోనే గర్భం దాల్చడం ఆడపిల్లల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందన్నారు. రాష్ట్రంలో బాల్య వివాహ చట్టం 2006, సంబంధిత చట్టాలను సవరించి, బాలికల కనీస వివాహ వయస్సును 21 ఏళ్లకు పెంచే ప్రతిపాదన చేశామని మంత్రి తెలిపారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)