Breaking News

బ్యాంకులోకి చేరిన వరద.. జనం కాపలా

Published on Tue, 07/08/2025 - 06:08

సిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తుండటం తెల్సిందే. మండి జిల్లాలోని థునాగ్‌ పట్టణంలోని రాష్ట్ర సహకార బ్యాంకు కార్యాలయంలోకి వరద నీరు చేరింది. రెండంతస్తుల ఈ భవనం మొదటి అంతస్తు వరద, చెత్తాచెదారంతో నిండిపోయింది. వరద తీవ్రతకు బ్యాంకు షట్టర్‌ ఒకటి ఊడిపోగా మరో రెండు షట్టర్లు వంకర్లు తిరిగి ఊడిపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. బ్యాంకులో ఖాతాదార్లు తాకట్టు పెట్టిన, లాకర్లలో భద్రంగా ఉంటుందని భావించిన లక్షలాది రూపాయల విలువైన నగలు, విలువైన పత్రాలు, కోట్లాది రూపా యల డబ్బు ఉన్నట్లు సమాచారం. అయితే, నష్టం వివరాలు వెల్లడి కాలేదు. 

చెత్తాచెదారం, వ్యర్థాలను తొలగించిన తర్వాతే నష్టాన్ని అంచనా వేసేందుకు వీలుంటుందని చెబుతున్నారు. థునాగ్‌ మార్కెట్‌ ప్రాంతంలో ఉన్న ఈ బ్యాంకులో నిత్యం 150 మంది వరకు వ్యాపా రులు లావాదేవీలు జరుపుతుంటారు. ఎనిమిదివేల జనాభా కలిగిన థునాగ్‌ పట్టణంలో బ్యాంకు ఇదొక్కటే. వరదల కారణంగా కొట్టుకువచ్చిన విలువైన వస్తువులను ఎవరైనా ఎత్తుకుపోయే ప్రమాదము ందని భావిస్తున్న స్థానికులు నిత్యం కాపలా కాస్తున్నారు. జూన్‌ 20–జూలై 6వ తేదీల మధ్య హిమాచల్‌లో భారీ వర్షాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. 
 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)