Breaking News

లోక్‌సభ: అవిశ్వాస తీర్మానంపై విపక్షాల్లో చీలిక?

Published on Tue, 02/10/2026 - 11:01

న్యూఢిల్లీ: లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస  తీర్మానంపై విపక్షాల్లో చీలిక ఏర్పడింది. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చేందుకు టీఎంసీ  నిరాకరించింది. అయితే కాంగ్రెస్‌ ఇప్పటికే వందమందికి పైగా ఎంపీల సంతకాలను సేకరించింది. స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ  ఆరోపిస్తోంది. రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్, కాంగ్రెస్ మహిళా ఎంపీలు ప్రధానిపై దాడి చేశారన్న స్పీకర్ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి ముందు లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై బీజేపీ మహిళా ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ప్రతిపక్ష సభ్యులు అత్యంత దారుణంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ నేడు (మంగళవారం) స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఫిబ్రవరి 4న సభా మర్యాదలను కాపాడేందుకు స్పీకర్ చేసిన ప్రయత్నాలను గుర్తుచేస్తూ, గందరగోళం సృష్టించిన ఎంపీలపై  కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పార్లమెంటు ప్రతిష్టను దిగజార్చేలా కొందరు సభ్యులు వ్యవహరించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రతిపక్ష ఎంపీలు మునుపెన్నడూ లేని విధంగా సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించారని బీజేపీ ఎంపీలు తమ లేఖలో వివరించారు. కొందరు సభ్యులు వెల్‌లోకి దూసుకురావడమే కాకుండా, స్పీకర్ టేబుల్‌పైకి ఎక్కి కాగితాలు చింపి, విసిరారని ఆరోపించారు. మరికొందరు మహిళా ఎంపీలు దూకుడుగా వ్యవహరిస్తూ, ప్లకార్డులు పట్టుకుని ట్రెజరీ బెంచీల వైపు వెళ్లారని, ఏకంగా ప్రధానమంత్రి కూర్చునే సీటును కూడా చుట్టుముట్టారని వారు పేర్కొన్నారు. ఇటువంటి హేయమైన చర్యలకు పాల్పడిన వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు.

బీజేపీ లేఖకు ఒకరోజు ముందే కాంగ్రెస్ మహిళా ఎంపీలు కూడా స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ప్రధాని మోదీ సభకు గైర్హాజరు కావడాన్ని సమర్థించుకునేందుకు పాలకపక్షం ఒత్తిడికి లొంగి, స్పీకర్ తమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని వారు మండిపడ్డారు. తమపై బురద చల్లడం ద్వారా  వారిలోని లోపాలను కప్పిబుచ్చే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీలు ఆరోపించారు. ప్రియాంక గాంధీ వాద్రా, జ్యోతిమణి సహా పలువురు నేతలు సంతకం చేసిన ఈ లేఖలో.. తమపై చేస్తున్న ఆరోపణలను వారు పూర్తిగా తోసిపుచ్చారు. తాము రాజ్యాంగ విలువలపై నమ్మకం ఉన్నవారమని, బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)