Breaking News

ప్రధానిపై పోటీ.. ఈ ట్రాన్స్‌జెండర్‌ గురించి తెలుసా?

Published on Mon, 04/08/2024 - 14:44

లక్నో: ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలలో ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసి నియోజకవర్గానికి  అత్యంత ప్రాధాన్యం ఉంది. కారణం ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుంచి ఇతర ప్రధాన పార్టీలతో పాటు ఓ ట్రాన్స్‌జెండర్‌ కూడా  పోటీ చేస్తున్నారు. 

వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై అఖిల భారత హిందూ మహాసభ (ABHM) ఉత్తరప్రదేశ్ విభాగం తరఫున మహామండలేశ్వర్ హేమాంగి సఖి మా పోటీ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వారణాసితో సహా ఉత్తరప్రదేశ్‌లోని 20 లోక్‌సభ స్థానాల్లో ఈ హిందూ మితవాద సంస్థ పోటీ చేయనుంది. ఈ ఎన్నికలలో చివరి దశలో జూన్ 1న వారణాసిలో పోలింగ్ జరగనుంది. 

వారణాసి నుంచి కాంగ్రెస్ తమ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర చీఫ్ అజయ్ రాయ్‌ను పోటీకి దింపింది. 2019లో వారణాసిలో ప్రధాని మోదీ 63 శాతం ఓట్లతో విజయం సాధించారు . సమాజ్‌వాదీ పార్టీకి చెందిన షాలినీ యాదవ్ తర్వాత రాయ్ మూడో స్థానంలో నిలిచారు. ఇండియా కూటమిలో భాగంగా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి.

మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ గీతా బోధకురాలు
హేమాంగి సఖి గుజరాత్‌లోని బరోడాలో జన్మించారు. ఆమె తండ్రి సినిమా డిస్ట్రిబ్యూటర్ కావడంతో ఆమె కుటుంబం ముంబైకి మారింది. సఖి కొంతకాలం కాన్వెంట్ స్కూల్‌లో చదువుకున్నారు. తల్లిదండ్రులు చనిపోవడంతో ఆమె పాఠశాల వదిలి వెళ్లిపోయారు. కొన్ని చిత్రాలలో నటించిన ఆమె ప్రముఖ టీవీ షోలలో కూడా కనిపించారు.

ముంబైలోని తన ఇంటికి సమీపంలో ఉన్న ఇస్కాన్ ఆలయంలో సఖికి శ్రీకృష్ణునిపై భక్తిప్రపత్తులు ప్రారంభమయ్యాయి. చివరికి బృందావనంలో దిగింది. తరువాత, ఆమె హేమాంగి సఖి మాగా మారారు. ఆమె ప్రపంచంలోని మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ భగవద్గీత బోధకురాలు. తన ఫేస్‌బుక్ పేజీ ప్రకారం ఆమె ప్రపంచవ్యాప్తంగా అనేక వేదికలలో భగవద్ కథ , రామ కథ, దేవి భగవత్ కథలను బోధించారు.

2019లో పట్టాభిషేకం
2019 ఫిబ్రవరిలో జరిగిన కుంభంలో ఆచార్య మహామండలేశ్వర్‌గా ఆమె పట్టాభిషేకం జరిగింది. ఆమెను అఖిల భారతీయ సాధు సమాజ్ భగవత్భూషణ్ మహామండలేశ్వర్ బిరుదుతో సత్కరించింది. ఉత్తర గోదావరి ధామ్‌లోని ఆద్య శంకర్ కైలాష్ పీఠం ఆమెకు ఆచార్య మహామండలేశ్వర్ బిరుదును ప్రదానం చేసింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)