Breaking News

హిమాచల్‌లో భారీ మంచు

Published on Thu, 12/26/2024 - 06:20

సిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌లో గత 24 గంటల్లో భారీగా మంచు కురియడంతో నలుగురు మృతి చెందారు. మూడు జాతీయరహదారు లు, మరో 220 దారులను మూసివేశారు. సిమ్లా, కులు, మండి, చంబా, సిర్మౌర్‌ జిల్లాలతో పాటు కిన్నౌర్, లాహౌల్, స్పితి జిల్లాల్లో భారీగా మంచు కురిసింది. పలు వాహనాలు అదుపుతప్పి బోల్తా పడటంతో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. దీంతో సిమ్లాలో 145, కులులో 25, మండీ జిల్లాల్లో 20 రహదారులను మూసివేశారు. 

356 ట్రాన్స్‌ ఫార్మర్‌ ఫెయిల్యూర్‌ కావడంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ లేదు. క్రిస్మస్, న్యూ ఇయర్‌ కోసం సిమ్లా, మనాలీలకు పర్యాటకులు పోటెత్తారు. స్థానిక నివేదికల ప్రకారం, అట్టారి నుంచి లేహ్, కులు జిల్లా లోని సంజ్‌ నుంచి ఔత్, కిన్నౌర్‌ జిల్లాలోని ఖాబ్‌ సంగం, లాహౌల్, స్పితి జిల్లాలోని గ్రామ్‌ ఫూ వరకు జాతీయ రహదారులు ట్రాఫిక్‌ కారణంగా మూసివేశారు. రోడ్లను క్లియర్‌ చేయడానికి హిమాచల్‌ ప్రభుత్వం రెండు స్నో బ్లోయర్లతో సహా 268 యంత్రాలను ఏర్పాటు చేసింది. జిల్లా యంత్రాంగం సూచనలను పాటించాలని, స్థానికులు చెప్పేది వినాలని, మంచులో డ్రైవింగ్‌ చేయవద్దని పర్యాటకులు సూచించింది.

తెల్లని వండర్‌ల్యాండ్‌గా హిమాచల్‌..  
హిమాచల్‌ ప్రదేశ్‌లోని సిమ్లా, మనా లీ వంటి పర్యాటక కేంద్రాలు తెల్లని వండర్‌ల్యాండ్‌గా మారాయి. అలాగే జమ్మూకాశీ్మర్‌లోని కొన్ని ప్రాంతాల్లో తాజాగా మంచుకురిసింది. ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయి కంటే అనేక డిగ్రీలు పడిపోయా యి. ఇది క్రిస్మస్‌ సెలవుల కోసం ప్రదేశాలను సందర్శించే పర్యాటకులకు ఉత్సాహాన్ని కలిగిస్తోంది. మరోవైపు వాహనాల రాకపోకలకు కష్టమవుతోంది. సోమవా రం అర్థరాత్రి మనాలీ, డల్హౌసీ శివారు ప్రాంతాల్లో తేలికపాటి హిమపాతం నమోదైంది. 

ఖద్రాలాలో అత్యధికంగా 24 సెంటీమీటర్లు, సంగ్లాలో 16.5 , షిల్లారోలో 15.3, చోపాల్, జుబ్బల్‌లో 15 సెంటీమీటర్ల చొప్పున, కల్పాలో 14, నిచార్‌లో 10, సిమ్లాలో 7, పూహ్‌లో 6, జోత్‌లో 5 సెంటీమీటర్ల చొప్పున మంచు కురిసింది. ప్రతికూల వాతావరణం, హిల్‌ స్టేషన్‌కు వెళ్లే మార్గంలో రహదారిపై ప్రాణాంతక పరిస్థితులు ఉన్నా పర్యాటకులు పోటెత్తారు. సిమ్లాలోని హోటల్‌ గదుల ఆక్యుపెన్సీ 70 శాతం నమోదైంది. గత ఏడాది డిసెంబర్‌ కంటే ఇది 30 శాతం ఎక్కువ. మంచు దుప్పటితో అందంగా కప్పబడిన సిమ్లా, మనాలీ చిత్రాలతో సోషల్‌ మీడియా నిండిపోయింది. శుక్రవారం సాయంత్రం నుంచి ఆదివారం మధ్యా హ్నం వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా సిమ్లాలో భారీ వర్షా లు, మంచు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)