Breaking News

హిమాచల్, ఉత్తరాఖండ్‌లో వర్ష బీభత్సం 

Published on Tue, 09/02/2025 - 04:29

న్యూఢిల్లీ: హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో సోమవారం భీకర వర్షాలు, కొండచరియలు విరిగి పడిన ఘటనల్లో ఏడుగురు చనిపోయారు.  ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ మార్గంలో సోమవారం ఉదయం కొండచరియలు విరిగి వాహనంపై పడగా ఇద్దరు యాత్రికులు చనిపోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సోన్‌ప్రయాగ్‌–గౌరీకుండ్‌ మార్గంలోని ముంకాటియా వద్ద కొండప్రాంతం పక్క నుంచి వెళ్తున్న వాహనంపై ఒక్కసారిగా బండరాళ్లు పడ్డాయని అధికారులు తెలిపారు. బాధితులంతా ఉత్తరకాశీ జిల్లాకు చెందిన వారేనన్నారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థి తి విషమంగా ఉందన్నారు. 

భారీ వర్షాలు కొనసాగుతుండటంతో ఛార్‌ ధామ్‌ యాత్ర, సిక్కుల హేమ్‌కుండ్‌ సాహిబ్‌కు వెళ్లే దారిని ఈ నెల 5వ తేదీ వరకు మూసివేసినట్లు అధికారులు వివరించారు. వాతా వరణం మెరుగయ్యాక, రహదారులు పూర్తి సురక్షితమని భావించిన తర్వాతే తిరిగి రాకపోకలను అనుమతిస్తామన్నారు. సోమవారం ఉదయం 8 గంటల వేళకు చంపావత్‌ జిల్లా బన్‌బాసాలో 25.64 సెంటీమీటర్లు, ఖతిమాలో 18.1 సెంటీమీటర్లు, తనక్‌పూర్‌లో 17.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వివరించారు. రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశమున్న డెహ్రాడూన్, ఉత్తరకాశీ, తెహ్రీ, పౌడీ, నైనిటాల్‌ తదితర 9 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించారు. 

హిమాచల్‌లో ఐదుగురు.. 
హిమాచల్‌ ప్రదేశ్‌లోని సిమ్లా జిల్లాలో 24 గంటల వ్యవధిలో వేర్వేరు చోట్ల కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ఐదుగురు చనిపోయారు. వీరిలో ఒక మహిళ, ఏడేళ్ల ఆమె కుమార్తె ఉన్నారు. జుంగాలోని డబ్లూ ప్రాంతంలో కొండచరియలు విరిగి ఇల్లు కూలడంతో తండ్రి, అతడి పదేళ్ల కుమార్తె మరణించారు. సిమ్లాలోని కోట్‌ఖైలో ఇల్లు కూలి వృద్ధ మహిళ మరణించారు. కొండచరియలు విరిగిపడటంతో సిమ్లా–కల్కా మార్గంలో నడిచే ఆరు రైళ్లను రద్దు చేశారు. దెబ్బతిన్న ఐదు జాతీయ రహదారులు సహా 793 రహదారులను మూసివేశారు. మంగళవారం వరకు ఆరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ విభాగం హెచ్చరించింది.   

కశ్మీర్‌లో అమిత్‌ షా పర్యటన  
జమ్మూకశ్మీర్‌లోని కత్రాలో భారీ వర్షం కురియడంతో మాతా వైష్ణోదేవి ఆలయాన్ని వరుసగా ఏడో రోజూ మూసి ఉంచారు. జమ్మూకశ్మీర్‌లోని వరద ప్రభావిత 
ప్రాంతాల్లోని వారి పునరావాసానికి అన్ని విధాలుగా సాయమందిస్తామని 
హోం మంత్రి అమిత్‌ షా తెలిపారు. సోమవారం జమ్మూలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. 
అనంతరం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా, సీఎం ఒమర్‌ అబ్దుల్లా, సీనియర్‌ నేతలతో రాజ్‌భవన్‌లో జరిగిన సమావేశంలో పరిస్థితిని సమీక్షించారు.  
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)