వరద విలయం.. వామ్మో.. ఆ గ్రామంలో రెండు కిలోమీటర్ల గొయ్యి

Published on Mon, 08/25/2025 - 08:36

జైపూర్: ప్రకృతి చూడడానికి ఎంత ప్రశాంతంగా ఉంటుందో.. ప్రకోపిస్తే వినాశనం కూడా అంత భయకరంగా ఉంటుంది. రాజస్థాన్‌లో భారీవర్షాలు దంచికొడుతున్నాయి. సవాయ్ మాధోపూర్ జిల్లాలోని జడవాటా గ్రామం వద్ద సుర్వాల్ డ్యామ్ పొంగిపోవడంతో 2 కిలోమీటర్ల పొడవైన పెద్ద గొయ్యి ఏర్పడింది. గ్రామం, పొలాల మీదుగా నీరు పొంగి ప్రవహిస్తోంది. ఈ గుంత 2 కిలోమీటర్లు పొడవు, 100 అడుగుల వెడల్పు, 55 అడుగుల లోతు ఉంది.

వర్షాలు కొనసాగితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  ఈ భారీ గొయ్యి కారణంగా వందల ఎకరాల వ్యవసాయ భూమి నీటి మునిగింది. వరద ఉధృతికి రెండు ఇళ్లు, రెండు షాపులు, రెండు దేవాలయాలు కూలిపోయాయి. పొలాల మీదుగా వచ్చిన నీరు గుంతలోకి ప్రవహించి జలపాతంలా మారింది.

ఆ గ్రామానికి చేరుకున్న ఆర్మీ బృందాలు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. సమీపంలోని ఇళ్లను ఖాళీ చేయించారు. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కరోడి లాల్ మీనా గుంతపై ఆరా తీశారు. వెంటనే ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించారు. నీటి ప్రవాహాన్ని మళ్లించేందుకు యంత్రాల సహాయంతో చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన ఆదేశించారు.

రాజస్థాన్‌.. భారీ వర్షాల కారణంగా అతలాకుతలమవుతోంది.. వందలాది గ్రామాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. గ్రామాలకు మధ్య సంబంధాలు తెగిపోయాయి. రాకపోకలు స్తంభించాయి. కోటా, బుండీ, సవాయ్ మాధోపూర్, ఝాలావార్ జిల్లాల్లో భారీ వర్షాల ప్రభావం అధికంగా ఉంది కనిపిస్తోంది. కోటా జిల్లాలోని నిమోడా గ్రామంలో 400కి పైగా ఇల్లు కూలిపోయాయి. వందలాది మంది ప్రజలు సహాయ శిబిరాల్లో తలదాచుకుంటుకున్నారు.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)