Breaking News

ఉత్తరాదిన కుంభవృష్టి 

Published on Wed, 08/27/2025 - 05:36

సిమ్లా/జమ్మూ: మేఘ విస్ఫోటం(క్లౌడ్‌ బరస్ట్‌) ఘటనల నుంచి తేరుకోకమునుపే మళ్లీ మేఘ విస్ఫోటాలు ఉత్తరాది రాష్ట్రాలపై విరుచుకుపడ్డాయి. హిమాలయాలకు నిలయాలైన హిమాచల్, జమ్మూలు ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు, కొండచరియలు పడిన ఘటనలతో వణికిపోయాయి. హిమాచల్‌లో మెరుపు వరదల ధాటికి ఇళ్లు, దుకాణాలు నేలమట్టమయ్యాయి. 

జమ్మూకశ్మీర్‌లోని రియాస్‌ జిల్లాలోని ప్రఖ్యాత మాతా వైష్ణోదేవి ఆలయ ట్రెక్కింగ్‌ మార్గంలో మంగళవారం మధ్యాహ్నం కొండచరియలు విరిగిపడడంతో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 14 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఖత్రాలోని బేస్‌క్యాంప్‌లో చేర్పించి చికిత్సనందిస్తున్నారు. త్రికూట పర్వతంపై కొలువైన ఆలయానికి ఖత్రానుంచి 12 కిలోమీటర్ల మార్గముంది. 

ఇందులో అర్థ్‌కువారీ సమీప ఇంద్రప్రస్థ భోజనాలయం సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో ఈ ఘోరం జరిగింది. ఆలయానికి రెండు మార్గాల్లో ట్రెక్కింగ్‌ చేస్తూ చేరుకోవచ్చు. మంగళవారం ఉదయం నుంచి హిమ్‌కోటీ ట్రెక్కింగ్‌ మార్గం గుండా యాత్రను నిలిపేశారు. పాత రూట్‌లో మధ్యాహ్నం 1.30దాకా ట్రెక్కింగ్‌ జరగ్గా  కొండచరియలు పడటంతో అది కూడా నిలిపేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టేదాకా వైష్ణోదేవి ఆలయానికి భక్తుల యాత్రను అర్ధా్థంతరంగా ఆపేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. 

ఉధృతంగా ప్రవహిస్తున్న నదులు
గత మూడ్రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జమ్మూ ప్రాంతంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వైష్ణోదేవి ఆలయ ఘటనతో కలిసి జమ్మూవ్యాప్తంగా వర్షసంబంధ ఘటనల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కశ్మీర్‌లో లోయలోనూ భారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల చిన్నపాటి వంతెనలు, మొబైళ్ల టవర్లు, విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి. 

ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుళ్లు సైతం తెగిపోవడంతో టెలికం, ఇంటర్నెట్‌ సేవలు దాదాపు ఆగిపోవడంతో లక్షలాది మంది ప్రజలు అవస్థలు పడుతున్నారు. రైలుపట్టాలపై రాళ్లు పడటంతో ఖత్రా, ఉధంపూర్, జమ్మూ రైల్వేస్టేషన్ల నుంచి ఇతర ప్రాంతాలకు 18 రైళ్లను రద్దుచేశారు. కొండచరియలు పడటంతో జమ్మూ–శ్రీనగర్, కిష్ఠ్‌వార్‌–దోడా జాతీయరహదారులపై రాకపోకలను అధికారులు నిలిపేశారు. 

ఇలా డజన్లకొద్దీ పర్వతసానువుల వెంట రహదారులు మూసేశారు. కిష్ఠివార్, రేసీ, రాజౌరీ, రాంబాన్, ఫూంఛ్‌ జిల్లాల్లోనూ వర్షబీభత్సం జరిగింది. ఇళ్లు నేలకూలాయి. కిష్‌్టవార్‌లోని ముఘల్‌ మైదాన్‌ వంతెన ధ్వంసమైంది. జమ్మూలో తక్షణం చేపట్టాల్సిన సహాయక చర్యలపై శ్రీనగర్‌లో ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు తగు  ఆదేశాలిచ్చారు.  

మనాలీలో బియాస్‌ ఉగ్రరూపం 
హిమాచల్‌ ప్రదేశ్‌లోని మనాలీలో బియాస్‌ నది ఉగ్రరూపం దాల్చి పరీవాహక ప్రాంతాలపై విరుచుకుపడింది. చాలా చోట్ల మనాలీ–లేహ్‌ రహదారి నదీప్రవాహం కారణంగా కొట్టుకుపోయింది. మనాలీలోని బహంగ్‌ ప్రాంతంలో బహుళ అంతస్తుల భవనం నీటి ఉధృతికి కూలి నదీప్రవాహంలో పడింది. రెండు రెస్టారెంట్లు, కొన్ని దుకాణాలు సైతం కొట్టుకుపోయాయి. 40 షాప్‌లు ధ్వంసమయ్యాయి. రహదారిపై నిలిచి ఉన్న వాహనాలు సైతం నదీప్రవాహంలో కొట్టుకుపోయాయి. సమీప ప్రాంతాల ప్రజలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. 

రాష్ట్రంలో పర్యటిస్తున్న యాత్రికులు పలు చోట్ల చిక్కుకుపోయారు. పత్లీకుహాల్‌ ప్రాంతంలో ఇళ్లు నీటమునిగాయి. కులూ ప్రాంతంలోనూ బియాస్‌ నది ఉధృతంగా ప్రవహించింది. కినౌర్‌ జిల్లాలోని కన్వీ గ్రామంలోనూ మేఘ విస్ఫోటం సంభవించింది. రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాల కారణంగా కొండచరియలు రహదారులపై పడటంతో రాకపోకలు స్తంభించాయి. దీంతో మంగళవారం ఒక్కరోజే మండీ జిల్లాలో 320, కులూ జిల్లాలో 132 రహదారులను మూసేశారు. కంగ్రా, చంబా, లహౌల్‌ స్పితి జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. 
 

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)