Breaking News

వర్షాల ఎఫెక్ట్‌.. సరుకు రవాణా బంద్‌.. తమిళనాడులో నిలిచిపోయిన 75వేల ట్రక్కులు

Published on Mon, 07/17/2023 - 16:03

చెన్నై: ఉత్తరభారత దేశంలో వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. వానల ధాటికి కాలువలు, వాగులు వంకలు నదులను తలపిస్తున్నాయి. రోడ్లు దెబ్బతిని రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. వీటితో పాటు సరుకు రవాణా కూడా బంద్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో ఉత్తరాదిలోని వివిధ రాష్ట్రాలకు వెళ్లాల్సిన వేలాది ట్రక్కులు తమిళనాడులో నిలిచిపోయాయి.

ఈ ట్రక్కులలో కొబ్బరికాయలు, సజ్జలు, స్టార్చ్, ఆరోగ్య సంరక్షణ మందులలో పదార్థాలుగా ఉపయోగించే ముడి పదార్థాలు, అగ్గిపెట్టెలు, క్రాకర్లు, వస్త్రాలు ఉక్కు మరియు ఇనుము పదార్థాలు వంటివి లోడ్లతో కూడిన 75 వేలకుపైగా ట్రక్కుల సరుకుని ఉత్తరాది రాష్ట్రాలకు రవాణా చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ట్రక్కులన్నీ తమిళనాడులోని వివిధ పట్టణాలు, నగరాల్లో ఆగిపోయాయి. ఇవి ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్‌లకు చేరుకోవాల్సి ఉంది.

మరోవైపు తమిళనాడుకు రావాల్సిన 25,000కు పైగా ట్రక్కులు ఉత్తరాది రాష్ట్రాల్లో నిలిచిపోయినట్లు లారీ ఓనర్స్ ఫెడరేషన్-తమిళనాడు అధ్యక్షుడు తెలిపారు.  పరిస్థితులు సాధారణ స్థితికి చేరిన తర్వాత, ప్రయాణానికి అనుకూలంగా మారిన తర్వాతే తమిళనాడు నుంచి లారీలు బయలుదేరుతాయని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా భారీ వర్షాల వల్ల వస్తువులను ఆర్డర్‌ పెట్టిన కంపెనీలు, ట్రక్‌ కంపెనీలతో పాటు డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

చదవండి: ఇకపై కేదార్‌నాథ్ ఆలయంలో పిచ్చి పనులు చేస్తే జైలుకే..

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)