Breaking News

Mahakumbh-2025: కుంభ స్నానం కోసం 21 కి.మీ నడిచి.. బ్యాంకు ఉద్యోగి విషాదాంతం

Published on Thu, 01/30/2025 - 12:04

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో మౌని అమావాస్య నాడు తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మంది మృతిచెందారు. ఒకరు కుమారుడిని కోల్పోగా, మరొకరు తల్లిని, ఇంకొకరు సోదరుడిని కోల్పోయారు. ఈ ప్రమాదంలో గాయపడిన 60 మంది బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటన అనంతరం మృతులకు సంబంధించిన విషాదగాథలు వెలుగు చూస్తున్నాయి. జార్ఖండ్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వచ్చిన ఒక వ్యక్తి త్రివేణి సంగమంలో స్నానం చేసేందుకు 21 కిలోమీటర్ల దూరం నడిచాడు. అయితే పుణ్య స్నానం చేయడానికి ముందే జీవితాన్ని ముగించాడు. వివరాల్లోకి వెళితే జార్ఖండ్‌లోని ఘట్‌శిల ‍ప్రాంతం నుండి పలువురు భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు ప్రయాగ్‌రాజ్‌ వ​‍చ్చారు. వారిలో ఒకరే బ్యాంకు ఉద్యోగి శివరాజ్ గుప్తా(58). బుధవారం తెల్లవారుజామున ఒంటి గంటకు జరిగిన తొక్కిసలాటలో శివరాజ్ గుప్తా మరణించారు.

శివరాజ్ గుప్తా 16 మంది భక్తుల బృందంతో కలిసి ప్రయాగ్‌రాజ్‌(Prayagraj)కు వచ్చారు. తొక్కిసలాట జరగడానికి కొద్దిసేపటికి ముందే శివరాజ్ గుప్తా తన స్నేహితులతో కలిసి సంగమం తీరానికి చేరుకున్నాడు. అతను త్రివేణీ సంగమంలో స్నానం చేసేలోపే, మృత్యువు అతనిని చుట్టుముట్టింది. బుధవారం తెల్లవారుజామున ఒంటి గంటకు జనం పెరగడంతో శివరాజ్ గుప్తా తన స్నేహితుల బృందం నుండి విడిపోయాడు. సరిగ్గా అదే సమయంలో జరిగిన తొక్కిసలాటలో శివరాజ్ గుప్తా జనసమూహం కాళ్ల  కింద నలిగి, ఊపిరాడక మరణించాడు.  

ఈ తొక్కిసలాట(Stampede)లో అతని బృందంలోని ఇతర సభ్యులు కూడా గాయపడ్డారు. శివరాజ్ గుప్తా భార్య పూనమ్ మీడియాతో మాట్లాడుతూ మంగళవారం రాత్రే తన భర్తతో మాట్లాడానని తెలిపారు. తన భర్త సంగమతీరం చేరుకునేందుకు 21 కిలోమీటర్లు నడవాల్సి వచ్చిందన్నారు. మర్నాటి ఉదయం  తొక్కిసలాట వార్త తెలియగానే పూనమ్ తన భర్తకు  ఫోన్ చేశారు. కానీ ఎటువంటి స్పందన రాలేదు. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు శివరాజ్ గుప్తా మృతి చెందినట్లు పూనమ్‌కు సమాచారం అందింది. శివరాజ్ గుప్తా జార్ఖండ్(Jharkhand) రాష్ట్ర సహకార బ్యాంకు ఉద్యోగి. అతని కుమార్తె స్వర్ణ ఢిల్లీలో  ఉద్యోగం చేస్తుండగా, కుమారుడు శివమ్‌ బెంగళూరులో ఉంటున్నాడు.

ఇది కూడా చదవండి: Mahakumbh-2025: తొక్కిసలాట అనంతరం భద్రత పెంపు

 

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు