Breaking News

‘నీట్‌’ పేపర్‌ లీకేజీపై నేడు సుప్రీంలో విచారణ

Published on Thu, 07/18/2024 - 10:14

ఢిల్లీ: ఇవాళ సుప్రీం కోర్టులో నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీ, అవతకవకలపై  విచారణ జరగనుంది. సుప్రీం కోర్టు సీజేఐ చంద్రచూడ్‌ ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

చివరి సారిగా ‘జులై 8న అత్యున్నత న్యాయ స్థానంలో నీట్‌ లీకేజీపై వ్యవహారంపై విచారణ జరిగింది. ఆ సమయంలో ‘నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) , కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పేపర్‌ లీకేజీపై తమ స్పందనలు తెలియజేస్తూ అఫిడవిట్లను దాఖలు చేశాయి. ఆ అఫిడవిట్లు అందరు పిటిషన్‌దారులకు ఇంకా చేరలేదు. వాటిని పరిశీలించేందుకు వీలుగా సమయమిస్తూ తదుపరి విచారణ జులై 18కి వాయిదా వేస్తున్నాం’ అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ పేర్కొన్నారు

సీల్డ్ కవర్లో సీబీఐ దర్యాప్తు నివేదిక
విచారణ సందర్భంగా నీట్ పరీక్షలో మాల్ ప్రాక్టీస్ కే పరిమితమని అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది.  ఐఐటి మద్రాస్ ఇచ్చిన నివేదిక ఆధారంగా అసాధారణ మార్కులు ఏ అభ్యర్థులకు రాలేదని స్పష్టం చేయగా.. నీట్‌ లీక్‌పై సీబీఐ తన దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు అందించింది. ఈ వరుస పరిణామల నేపథ్యంలో ఇవాళ నీట్‌పై సుప్రీం కోర్టులో కీలక విచారణ జరగనుంది. 

నీట్‌లో పేపర్‌ లీకేజీపై వరుస అరెస్ట్‌లు
మరోవైపు నీట్‌ పేపర్‌ లీకేజీ నిందితులను అరెస్ట్‌లు కొనసాగుతున్నా‍యి. కేంద్రం ఆదేశాలతో దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు ఈ కేసులో ఇప్పటి వరకు 14మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. తాజాగా ఈ వారంలో.. కీలక నిందితుడు పంకజ్ కుమార్  అలియాస్  ఆదిత్య, అతని సహాయకుడు రాజుసింస్‌ను అదుపులోకి తీసుకున్నారు. సీబీఐ అధికారుల విచారణలో పంకజ్‌ కుమార్‌ హజారీబాగ్‌లోని నేషనల్  టెస్టింగ్  ఏజెన్సీ నుంచి నీట్  ప్రశ్నపత్రం తస్కరించినట్లు అధికారులు తెలిపారు.  నిందితుల్లో మొత్తం ఆరుగురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైనట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు.

Videos

నెల్లూరులో స్క్రూటినీ పేరుతో అధికారుల హైడ్రామా

తాడిపత్రిలో జేసీ ఒత్తిళ్లకు తలొగ్గిన ఎన్నికల అధికారులు

కోమటిరెడ్డి Vs అనిరుధ్ రెడ్డి.. డిండి నీళ్ల పంచాయితీ

Fire accident : చార్మినార్ ప‌రిధిలో భారీ అగ్నిప్రమాదం

కోనేరులోకి దూసుకెళ్లిన ఇన్నోవా.. తప్పిన పెను ప్రమాదం

తెలుగు ప్రజలకు YS జగన్ దసరా శుభాకాంక్షలు

పులివెందులలో ఖాకీ కుట్ర.. YSRCP శ్రేణులపై ఏకే 47తో కాల్పులు..

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)