Breaking News

కవిత పిటిషన్‌పై విచారణ వాయిదా

Published on Sat, 07/13/2024 - 05:57

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించి సీబీఐ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వా­యిదా పడింది. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంతోపాటు తన అరెస్టును సవాల్‌ చేస్తూ కవిత దాఖలు చేసిన డిఫాల్ట్‌ బెయిల్‌ పిటిషన్‌పై శుక్రవారం రౌజ్‌ఎవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌ను విచారించిన ప్రత్యేక కోర్టు న్యాయ­మూర్తి కావేరీ బవేజా ఈ నెల 22కు విచారణను వాయిదా వేశారు. కేసు­ను మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిఉంది కాబట్టి బెయిల్‌ మంజూరు చేయడం సరికాదని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. అయితే, సీబీఐ చార్జిïÙట్‌లో తప్పులున్నాయని కవిత తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై సీబీ­ఐ న్యాయవాది స్పందిస్తూ.. తప్పులు లేవన్నారు. డిఫాల్ట్‌ బెయిల్, చార్జిషీట్‌లో తప్పులపై విచారణ జరిగేవరకు చార్జిïÙట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై విచారణ వాయి దా వేయాలని కవిత తర­ఫు న్యాయవాది కోర్టు కు విజ్ఞప్తి చేశారు. అయితే.. చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశానికి, కవిత డిఫాల్ట్‌ బెయిల్‌కు సంబంధం లేదని సీబీఐ తరఫు న్యాయవాది వాదించారు. కాగా, ‘60 రోజు­ల తర్వాత తప్పులతో కూడిన చార్జిïÙట్‌ను దాఖ లు చేయడం తన క్లయింట్‌ డిఫాల్ట్‌ బెయిల్‌ హక్కులను కాలరాయడమే’అని కవిత తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరు పక్షాల వాదనల అనంతరం  22న కేసు విచారణ చేపడతామని న్యాయమూర్తి తెలిపారు.

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)