Breaking News

ఆపకపోతే చర్యలు తప్పవు.. 15 వెబ్‌సైట్లకు కేంద్రం నోటీసులు!

Published on Tue, 07/18/2023 - 15:37

నిషేధిత ఈ-సిగరెట్లపై కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ- సిగరెట్ల ప్రచారం, విక్రయాలు జరుపుతున్న వెబ్‌సైట్లపై కొరడా ఘుళిపించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే  ఈ-సిగరెట్ల అమ్మకాలు, వాటికి సంబంధించిన ప్రకటనలను చేపడుతున్న 15 వెబ్‌సైట్లకు తమ కార్యకలపాలు నిలిపివేయాలంటూ కేంద్ర ఆరోగ్యశాఖ నోటీసులు జారీ చేసింది. లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరో వైపు ఈ-సిగరెట్లపై నిషేధాన్ని సమర్థంగా పాటించేలా చూడాలని ఆరోగ్య శాఖ ఇటీవల అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది.

సోషల్ మీడియాలో ఈ-సిగరెట్ల ప్రకటనలు, విక్రయాలను కూడా మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోందని, మరో ఆరు వెబ్‌సైట్‌లు కూడా పర్యవేక్షణలో ఉన్నాయని, త్వరలో వాటికి నోటీసులు జారీ చేయవచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. "టేక్‌డౌన్ నోటీసులు జారీ చేసిన 15 వెబ్‌సైట్‌లలో నాలుగు కార్యకలాపాలు నిలిపివేయగా.. మిగిలినవి ఇంకా స్పందించలేదని  అధికారలు తెలిపారు.

నోటీసులు అందుకున్న వెబ్‌సైట్‌ యాజమాన్యం ప్రతిస్పందించి, చట్టానికి లోబడి ఉండకపోతే, ఈ వెబ్‌సైట్‌లను తొలగించేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తక్షణమే ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు లేఖ రాయాలని భావిస్తోంది. తదనుగుణంగా ఈ వెబ్‌సైట్‌లపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని యోచిస్తోంది. ఎలక్ట్రానిక్ సిగరెట్లపై నిషేధం (ఉత్పత్తి, తయారీ, దిగుమతి, ఎగుమతి, రవాణా, అమ్మకం, పంపిణీ, నిల్వ ప్రకటన) చట్టం 2019లో అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.

చదవండి: సరిహద్దులు దాటిన ‘కృష్ణ’ ప్రేమ.. బంగ్లాదేశ్‌ నుంచి రహస్యంగా వచ్చి..

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)