Breaking News

కూర్చున్న చోటే కుప్పకూలిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఉద్యోగి..

Published on Wed, 09/25/2024 - 16:16

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో విషాద ఘటన జరిగింది. గోమతినగర్‌లోని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఉద్యోగిని ఆఫీసులోనే తన డెస్క్లో కుర్చీలో నుంచి కిందపడి కుప్పకూలి మరణించింది. గోమతి నగర్ ప్రాంతంలోని విభూతిఖండ్ హెచ్డీఎఫ్సీ బ్యాంకులో సాదఫ్ ఫాతిమా (45) అడిషనల్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్గా విధులు నిర్వర్తిస్తోంది. రోజూలానే మంగళవారం కూడా ఉద్యోగ నిమిత్తం బ్యాంకుకు వెళ్లింది.

ఏం జరిగిందో తెలియదు.. ఉన్నట్టుండి కూర్చున్న కుర్చీలోనే కుప్పకూలిపోయింది.  గమనించిన తోటి బ్యాంకు సిబ్బంది హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఇటీవల డిప్యూటీ వైఎస్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆమెపై పని ఒత్తిడి తీవ్రంగా ఉందని, ఈ కారణంగానే పని ఒత్తిడి వల్ల టెన్షన్ పెరిగిపోయి హార్ట్ అటాక్ వచ్చి ఉండొచ్చని సహోద్యోగులు చెబుతున్నారు.

ఫాతిమా అనుమానాస్పద మృతిపై విభూతిఖండ్ అసిస్టెంట్ కమిషనర్ రాధారమణ్ సింగ్ మాట్లాడుతూ.. ఆమె మృతదేహాన్ని పోస్ట్మార్టానికి పంపించామని తెలిపారు. పోస్ట్మార్టం అనంతరం ఆమె మృతికి కారణం ఏంటనే విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

ఇక ఈ ఘటనపై సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తన ‘ఎక్స్’ ఖాతాలో స్పందించారు. ఈ ఘటన దిగ్బ్రాంతికి గురిచేసిందని అన్నారు. ఈ సంఘటన దేశ ప్రస్తుత ఆర్థిక ఒత్తడిని ప్రతిబింబిస్తోందని, ఇలాంటి ఆకస్మిక మరణాలు పని పరిస్థితులను ప్రశ్నార్థకం చేస్తాయని తెలిపారు. దీనికి అడ్డుకట్ట పడాలంటే.. దేశంలోని అన్ని కంపెనీలు ఈ విషయంపై ఆలోచన చేయాలని సూచించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)