Breaking News

కర్ణాటకలో టెస్లా..? ‘నేను స్వార్థపరుడిని కాదు’

Published on Wed, 06/12/2024 - 10:48

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి తాను స్వార్థపరుడిని కాదని, తన దృష్టి దేశ అభివృద్ధిపైనే  ఉందని అన్నారు. తాను దృష్టి కేవలం సొంత రాష్ట్రం కర్ణాటకపైన లేదని, మొత్తం భారత్‌ దేశం అంతటా అభివృద్ది చెందాలని ఉ‍న్నట్లు తెలిపారు. ఆయన భారీ పరిశ్రమల శాఖమంత్రిగా మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఈ  సందర్భంగా మీడియాతో మాట్లాడారు.  టెస్లా వంటి అంతర్జాతీయ కంపెనీ కర్ణాటకలో  తన ఫ్యాక్టరీ పెట్టాలని ఆసక్తి చూపుతుందా?  అని ఓ రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నపై స్పందించారు.  

‘‘ టెస్లా వంటి కంపెనీని కర్ణాటకకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. అయితే నా ప్రాధ్యాన్యత కేవలం కర్ణాటకకు పరిమితం కాదు. ఇది దేశం మొత్తానికి సంబంధించిన అభివృద్ధి. దాని ప్రకారమే పని చేస్తాం. నేను అంత స్వార్థపరుడిని కాదు. దేశ అభివృద్ధి కోసం నిజాయితీగా పనిచేస్తా’’ అని హెచ్‌డీ కుమార స్వామి అన్నారు.

నరేంద్ర మోదీ మూడో సారి ప్రధానిగా ప్రమాస్వీకారం చేసిన సందర్భంగా టెస్లా సీఈఓ ఇలాన్‌ మాస్క్‌ మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. తన కంపెనీలు ఇండియాలో పని చేయాలని ఎదురుచూస్తున్నట్లు ‘ఎక్స్‌’ వేదికగా తెలిపారు.

ఇక.. బీజేపీ కూటమిలో భాగంగా కుమార​ స్వామి జేడీఎస్‌ పార్టీ రెండు లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించింది. దీంతో  ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో కుమారస్వామి కేంద్రమంతి పదవి దక్కించుకున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నా  ఎన్డీయే కూటమి పార్టీలు 28 స్థానాలకు గాను 19 సీట్లతో  విజయం సాధించాయి.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)