Breaking News

హత్రాస్ తొక్కిసలాట.. భోలే బాబాపై తొలి కేసు న‌మోదు

Published on Sat, 07/06/2024 - 15:44

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హ‌థ్రాస్‌ జిల్లాలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి సూర‌జ్ పాల్ అలియాస్ నారాయ‌ణ్ హ‌రి సాక‌ర్ అలియాస్‌ భోలే బాబాపై తొలి కేసు న‌మోదైంది. పాట్నా చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఆయ‌న‌పై కేసు నమోదైంది.

కాగా, జూలై 2న 121 మంది ప్రాణాలను బలిగొన్న హత్రాస్ తొక్కిసలాటలో ప్రధాన నిందితుడు దేవ్ ప్రకాష్ మధుకర్‌ను శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. మ‌ధుకర్‌ను శనివారం స్థానిక కోర్టులో హాజరుపరచనున్నారు. తొక్కిసలాట జరిగిన సత్సంగానికి చెందిన 'ముఖ్య సేవాదార్' మధుకర్ ప్రథమ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఏకైక నిందితుడు. కాగా ఉత్తరప్రదేశ్ పోలీసులు మధుకర్‌ను పట్టుకునే వారికి రూ.లక్ష రివార్డు ప్రకటించిన సంగ‌తి తెలిసిందే

ఇక తొక్కిస‌లాట ఘ‌ట‌న త‌ర్వాత భోలో బాబా తొలిసారి మీడియా ముందుకు వ‌చ్చారు. జులై 2న జరిగిన ఘటనతో చాలా వేదనకు గురైనట్లు తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో బాధను భరించే శక్తి ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించినట్లు చెప్పారు. 

ప్రభుత్వం, పాలనా యంత్రాంగంపై నమ్మకం ఉంచాలని బాధితులకు సూచించారు. ఘటనకు కారకులను విడిచిపెట్టరనే విశ్వాసం తనకు ఉన్నట్లు పేర్కొన్నారు. మరణించిన కుటుంబాలు, గాయపడిన వారికి అండగా ఉండాలని కమిటీ సభ్యులను అభ్యర్థించినట్లు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు.

మ‌రోవైపు హత్రాస్ దుర్ఘటనపై విచారణ జరిపేందుకు, తొక్కిసలాట వెనుక కుట్ర ఉందనే విషయాన్ని పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జూలై 3న హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల న్యాయ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)