Breaking News

పెళ్లికి వెళ్తున్నానని చెప్పి… ప్రియుడితో బిహార్‌కు పరార్!

Published on Mon, 02/16/2026 - 13:32

శివాజీనగర(కర్ణాటక): హాసన్‌ జిల్లాలో బేలూరు వద్ద పెళ్లికి వెళ్లి అదృశ్యమైన వివాహిత కేసులో అనూహ్య మలుపు ఇది. ప్రియునితో వెళ్లిపోయినట్లు తేలింది. వివరాలు.. బేలూరుకు చెందిన   ఓ మహిళను కుణిగల్‌ తాలూకా యలియూరువాసి పెళ్లి చేసుకున్నాడు. అతనికి బిహార్‌కు చెందిన వలస కార్మికుడు దేవిడ్‌ పరిచయం. అతడు అప్పుడప్పుడు ఇంటికి వస్తుండగా  ఆమెకు వివాహేతర  సంబంధం ఏర్పడింది. దీంతో ఇద్దరూ బిహార్‌కు పారిపోవాలని పథకం వేశారు. 

ఆ మేరకు ఫిబ్రవరి 12న  చిక్కమగళూరు జిల్లాలో బంధువుల వివాహానికి వెళుతున్నానని సుమారు రూ.20 లక్షలు విలువచేసే బంగారు నగలతో వెళ్లింది. ఆరోజు రాత్రి కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి తనను ఎవరో కిడ్నాప్‌ చేశారని ఫోన్‌లో చెప్పి స్విచాఫ్‌ చేసింది. ఆమె బట్టలు, బ్యాగు రోడ్డుపై పడేసి ప్రియునితో ఉడాయించింది. దీంతో శనివారం పోలీసులు అక్కడ చెరువులు, వాగుల్లో వెతికినా జాడ లేదు. చివరకు మొబైళ్ల లొకేషన్‌ని తనిఖీ చేయగా, తుమకూరు జిల్లా కుణిగల్‌లో ఉన్నట్లు తెలిసింది. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

మహిళ ఆత్మహత్య  
కోలారు: ఫినాయిల్‌ తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముళబాగిలు తాలూకా  భైరకూరు గ్రామానికి చెందిన చైత్ర (27) అనే వివాహిత ఆదివారం మృతి చెందింది. బెంగుళూరు రూరల్‌ జిల్లా ఆనేకల్‌కు చెందిన చైత్రను ముళబాగిలు తాలూకా భైరకూరుకు చెందిన బాలకృష్ణ రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. అయితే భర్త మొదటి భార్య, అత్త వేధిస్తున్నారనే ఆవేదనతో ఈ నెల 10న పినాయిల్‌ తాగింది. ఆమెను బెంగళూరులోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. చైత్ర తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో బాలకృష్ణ, అతని తల్లి, మొదటి భార్యను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)