Breaking News

Crime News: దా.. బండెక్కు! అన్నాడు..

Published on Sat, 01/07/2023 - 08:03

క్రైమ్‌: పొరుగింట్లో ఉంటోంది.. కాస్త చనువు ప్రదర్శిద్దామనుకున్నాడో ఏమో.. వచ్చి బండెక్కు అన్నాడు!.  అయితే.. ఆమె ప్రతికూలంగా స్పందించింది. అవమానంగా అనిపించింది కాబోలు పట్టరాని కోపంతో ఊగిపోయాడు. నడిరోడ్డు మీదే ఆమెపై దాడికి దిగాడు. తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రి పాలుకాగా, పరారీలో ఉన్నాడు నిందితుడు. 

హర్యానా గురుగ్రామ్‌లో ఓ మహిళపై వ్యక్తి దాడికి పాల్పడిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా వీడియో వైరల్‌ కావడంతో సుమోటోగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ట్రేస్‌ చేసి నిందితుడ్ని కమల్‌ అనే వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం అతని ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు ఏసీపీ మనోజ్‌ మీడియాకు వెల్లడించారు. 

బాధితురాలు కమల్‌ పక్క ఇంట్లోనే ఉంటోందని విచారణలో తేలింది. ఆటోలో ఆమె కూర్చుని ఉండగా.. బైక్‌ మీద వచ్చిన కమల్‌ ఆమెతో మాట్లాడాడు. వచ్చి తన బైక్‌ ఎక్కాలని ఆమెను కోరాడు. అయితే ఆమె అంగీకరించకపోవడంతో.. కోపంతో ఊగిపోతూ ఆమెపై దాడికి దిగాడు. చేతిలో ఉన్న హెల్మెట్‌తో బాదేశాడు. స్థానికులు కొందరు గుమిగూడి.. కమల్‌ను నెట్టేయడంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ఏసీపీ మనోజ్‌ పేర్కొన్నారు.

వీడియో కోసం క్లిక్‌ చేయండి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)