ఈడీ దాడులు.. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో 5 కోట్ల నగదు, అక్రమ ఆయుధాల సీజ్‌

Published on Fri, 01/05/2024 - 16:38

చండీగఢ్‌: కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ హర్యానాలోని ప్రతిపక్ష నేతల ఇళ్లపై మెరుపు దాడులు చేపట్టింది. అక్రమ మైనింగ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భాగంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సురేందర్‌ పన్వార్‌, ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌(ఐఎన్‌ఎల్‌డీ) మాజీ ఎమ్మెల్యే దిల్‌బాగ్‌ సింగ్‌, మరికొందరి ఇళ్లల్లో  సోదాలు నిర్వహించింది. యమునా నగర్, సోనిపట్, మొహాలీ, ఫరీదాబాద్, చండీగఢ్, కర్నాల్‌ వంటి 20 ప్రదేశాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు.

తొలుత మైనింగ్‌ వ్యాపారవేత్త అయిన మాజీ ఎమ్మెల్యే దిల్‌బాగ్‌ సింగ్‌, అతని సన్నిహితుల నివాసాల్లో గురువారం ఈడీ తనిఖీలు చేపట్టింది. 15, 20 మంది ఈడీ అధికారులు ఆరు వాహనాల్లో మాజీ ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు. శుక్రవారం కూడా సోదాలు కొనసాగాయి. కుటుంబంలోని అందరి సెల్‌ఫోన్లను ఈడీ అధికారులు సీజ్‌ చేశారు. 

దాదాపు 100 బాటిళ్ల మద్యం, రూ. 5 కోట్ల నగదు, భారీగా అక్రమ విదేశీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మద్యం, నగదుతో పాటు 4 నుంచి 5 కిలోల బరువున్న మూడు బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా సింగ్‌ యమునానగర్‌ మాజీ శాసన సభ్యుడు. అదే విధంగా ఎమ్మెల్యే పన్వార్‌ ఇంట్లోనూ దాడులు కొనసాగాయి ఆయన సోనిపట్‌ నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) నిషేధం విధించిన మైనింగ్‌పై యమునానగర్, చుట్టుపక్కల జిల్లాల్లో అక్రమంగా బండరాళ్లు, కంకర, ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ హర్యానా పోలీసులు అనేక కేసులు నమోదు చేశారు. అనంతరం దీనిపై 2013లో ఈడీ మనీలాండరింగ్ కేసు దాఖలు చేసింది. ఈ కేసులో ఇద్దరు ఎమ్మెల్యేలను నిందితులుగా పేర్కొంది. వీరు మైనింగ్ కోసం బిల్లులు, స్లిప్పులను రూపొందించడానికి నకిలీ 'ఈ-రవాణ' పథకాన్ని నడుపుతున్నట్లు ఈడీ ఆరోపించింది. 

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)