Breaking News

బుల్లెట్ల వర్షం కురుస్తున్నా..సాహసంతో తరిమికొట్టింది!

Published on Tue, 11/28/2023 - 16:04

తుపాకీతో కాల్పులు జరుపుతున్న  నలుగురు దుండగులను ధైర్యంగా ఎదిరించిందో మహిళ. కేవలం పొడవాటి చీపురు కర్ర (దులుపు కర్ర)సాయంతో షూటర్లను తరిమి కొట్టింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. హర్యానాలో భివానీలోని ఈ ఘటన చోటు చేసుకుంది. షాకింగ్ దృశ్యాలకు సంబంధించిప వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

హర్యానాలో వానీలోని డాబర్ కాలనీలో   హరికిషన్ తన ఇంటికి వెళ్ళే గేటు పక్కనే నిలబడి ఉన్నాడు.  రెండు బైక్‌లపై వచ్చిన నలుగురు వ్యక్తులు వచ్చారు. బండిపై నుంచి దిగిన పిలియన్ రైడర్లు ఇద్దరు హరికిషన్‌పై కాల్పులు జరపడంతో, అతను లోపలికి పోయి, తప్పించుకున్నాడు.  ఇంతలో  పక్కనుంచి వచ్చిన మహిళ చాలా ధైర్యసాహసాలు ప్రదర్శించింది. కాల్పులు మోత మోగుతున్నాఏ మాత్రం వెనకడుగు వేయలేదు. షూటర్ల మీదికి  కొబ్బరి పుల్లలతో  కట్టిన దులుపు కర్రతో ఎటాక్‌ చేసేందుకు ప్రయత్నించింది.  దీంతో వారు ఆ ప్రదేశంనుంచి  ఉడాయించిక  తప్పలేదు.  ఈ క్రమంలో ఆ మహిళపై కూడా  కాల్పులు జరిపారు. కానీ  ఆమె తప్పించుకుంది. ముష్కరులు తొమ్మిది రౌండ్లు కాల్పులు జరపగా, హరికిషన్‌కు నాలుగు బుల్లెట్ గాయాలయ్యాయి. మహిళ హరికిషన్ కుటుంబసభ్యులా లేక పొరుగింటి మహిళా అనేది స్పష్టత లేదు. 

బాధితుడిని చికిత్స నిమిత్తం పీజీఐఎంఎస్ రోహ్‌తక్‌కు తరలించినట్లు పోలీసు అధికారి దీపక్ మీడియాకు తెలిపారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని స్కాన్ చేస్తున్నారని, షూటర్లను, వారితో పాటు వచ్చిన ఇద్దరు రైడర్లను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

ఇది ఇలా ఉండగా రవి బాక్సర్ హత్య కేసులో హరికిషన్‌ నిందితుడు.ఇతనికి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో సంబంధాలున్నట్లు భావిస్తున్నారు. హరికిషన్ ప్రస్తుతం బెయిల్‌పై  ఉన్నాడు. అతడిపై  దాడికి  పాల్పడినట్టుగా అనుమానిస్తున్న ఐదుగురిని మూడు నెలల క్రితం భివానీ పోలీసులు అరెస్టు చేశారట.  

Videos

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)