Breaking News

గౌహతి నీట మునక.. అంతటా రెడ్‌ అలర్ట్‌

Published on Sat, 05/31/2025 - 10:17

గౌహతి: అస్సోంలోని గౌహతి(Guwahati)లో కుండపోత వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఫలితంగా నగరంలో జనజీవనం స్థంభించిపోయింది. చాంద్‌మరి, హతిగావ్, సిజుబారి, రుక్మినిగావ్, బెల్టోలా, నబిన్ నగర్, రాజ్‌గఢ్‌ తదితర ప్రాంతాలు నీటిలో నానుతున్నాయి.  ఆగకుండా కురుస్తున్న వర్షాలు, సంభవిస్తున్న వరదలు రహదారులను ముంచెత్తుతున్నాయి.
 

నగరంలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ, శిథిలమైన రోడ్లు పరిస్థితులను మరింత  దిగజారుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా విధిస్తున్న విద్యుత్‌ నిలిపివేతలు గౌహతివాసులను మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టివేస్తున్నాయి. గత రెండు రోజులుగా కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై  నడుము లోతు వరకూ నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్(Traffic) పూర్తిగా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను తరలించేందుకు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్‌)రబ్బరు పడవలను  ఉపయోగిస్తోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో జల రవాణా శాఖ గౌహతి, ఉత్తర గౌహతి మధ్య అన్ని ఫెర్రీ సేవలను నిలిపివేసింది.

భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మే 31 వరకు అస్సాం అంతటా రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ నుండి అతి భారీ వర్షాలు కొనసాగుతాయని అంచనా వేసింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన  వాయుగుండం కారణంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయని, గంటకు 60 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఎస్‌డీఎంఏ) కొండచరియలు విరిగిపడే అవకాశం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, అధికారులను అక్కడి ప్రజలను అప్రమత్తం చేసింది. 

 

ఇది కూడా చదవండి: గుంతలో పడిన కారు.. ఐదుగురు మృతి

 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)