నకిలీ ఓటర్లను ఎలా అనుమతిస్తాం.. విమర్శలపై ఈసీ క్లారిటీ

Published on Thu, 07/24/2025 - 12:00

ఢిల్లీ : బీహార్‌లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)పై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్న వేళ ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఓటర్ల జాబితా విషయంలో ప్రతిపక్షాల విమర్శలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. బీహార్‌లో నకిలీ ఓటర్లను ఎలా అనుమతిస్తామంటూ ఓటరు జాబితా సవరణ ప్రక్రియను ఈసీ సమర్థించుకుంది. ఈమేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్‌కుమార్‌ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ క్రమంలో ప్రతిపక్షాలను ఆరోపణలను తోసిపుచ్చారు.

ఈ సందర్భంగా జ్ఞానేశ్‌కుమార్‌..‘భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి తల్లి వంటిది. బీహార్‌లో నకిలీ ఓట్లను తొలగించడానికి మేము ప్రయత్నిస్తున్నాం. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ప్రతిపక్షాలు తీవ్రంగా అభ్యంతరాలు చేయడంతో అర్థం లేదు. నకిలీ ఓటర్లకు ఎన్నికల సంఘం ఎందుకు అవకాశం ఇస్తుంది?. ఎస్‌ఐఆర్‌ నిష్పాక్షికంగా, నిబంధనల ప్రకారమే జరిగింది. ఓటర్ల జాబితాలో నకిలీ పేర్లు చేర్చడమన్నది పూర్తిగా నిరాధారమైంది. చనిపోయిన ఓటర్లు పేర్లు కూడా జాబితాలో ఉన్నాయి. రెండు చోట్ల ఓటు హక్కు ఉన్న వారు.. నకిలీ ఓటర్లు లేదా విదేశీ ఓటర్లను మాత్రమే జాబితా నుంచి తొలగించడం జరుగుతుంది అని చెప్పుకొచ్చారు. ఈ ప్రక్రియ మొదట బీహార్‌లో రానున్న రోజుల్లో మొత్తం దేశంలో జరుగుతుంది అని వెల్లడించారు. 


లక్ష మంది ఓటర్లు ‘దొరకట్లేదు’..
ఇదిలా ఉండగా.. బీహార్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ కొనసాగిస్తోంది. బీహార్‌లో 7.17 కోట్లకుపైగా ఓటర్లు ఉన్నారు. అనర్హులైన ఓటర్లు బయటపడుతున్నట్లు తెలిసింది. సుమారు లక్ష మంది ఓటర్ల జాడ తెలియట్లేదని ఎన్నికల సంఘం బుధవారం వెల్లడించింది. ఓటర్ల జాబితాలో వారి పేర్లు ఉన్నప్పటికీ భౌతికంగా ఎక్కడున్నారో కనిపెట్టలేకపోతున్నామని స్పష్టంచేసింది. 20 లక్షల మంది ఓటర్లు మరణించినట్లు ఈ ప్రత్యేక సవరణలో తేలిందని పేర్కొంది. అలాగే మరో 28 లక్షల మంది చిరునామాలు శాశ్వతంగా మారాయని తెలిపింది. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ తొలి దశ ఆగస్టు ఒకటో తేదీ నాటికి పూర్తికానుంది. తర్వాత ముసాయిదా ఎన్నికల జాబితాను ప్రచురిస్తారు. ఇందులో లోపాలు ఉన్నట్లు ఎవరైనా గుర్తిస్తే అభ్యంతరాలు వ్యక్తం చేయొచ్చు. ఓటర్ల జాబితాలో అర్హుల పేర్లు లేకపోతే సెపె్టంబర్‌ ఒకటో తేదీ దాకా ఫిర్యాదులు సమర్పించవచ్చు.    

Videos

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)