రూ.41 లక్షలు : లాయర్‌ ముసుగులో ఐఎస్‌ఐ గూఢచారి!

Published on Thu, 12/04/2025 - 17:19

అమృత్‌సర్‌: పాకిస్థాన్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ కోసం గూఢచర్యం చేసి, సమాచారాన్ని చేరవేసిన ఆరోపణలపై అరెస్టయిన గుర్గామ్‌ న్యాయవాది రిజ్వాన్‌ కేసులో దర్యాప్తు సంస్థలకు పలు కీలక విషయాలు తెలిశాయి. అరెస్టయిన రిజ్వాన్‌కు రెండు బ్యాంక్‌ ఖాతాలు ఉన్నాయని, డబ్బు సేకరించేందుకు అతను ఏకంగా ఏడుసార్లు అమృత్‌సర్‌ వెళ్లాడని, అతని స్నేహితుడు, న్యాయవాది ముషారఫ్‌ అలియాస్‌ పర్వేజ్‌ పోలీసులకు తెలిపాడు. 

2022లో సోహ్నా కోర్టులో ఇంటర్న్‌షిప్‌ చేస్తున్నప్పుడు రిజ్వాన్‌తో స్నేహం ఏర్పడిందని ముషారఫ్‌ చెప్పాడు. జూలైలో, ఇద్దరూ కలిసి ముషారఫ్‌ కారులో అమృత్‌సర్‌ వాఘా సరిహద్దుకు వెళ్లారు. అక్కడ స్వర్ణ దేవాలయం వద్ద, ద్విచక్ర వాహనంపై వచ్చిన కొందరి నుండి రిజ్వాన్‌ ఒక సంచి నిండా డబ్బు తీసుకున్నాడు. అయితే, వారిని గుర్తించలేక పోయానని ముషారఫ్‌ తెలిపాడు. తిరిగి వస్తుండగా ప్రమాదం జరగడంతో.. కారును అక్కడే వదిలి రైలులో ప్రయాణించారు. ఆగస్టు 1న కారు తీసుకురావడానికి మళ్లీ అమృత్‌సర్‌ వెళ్లారని ముషారఫ్‌ చెప్పాడు.

ఇదీ చదవండి: ఇల్లు కట్టాలంటే రూ. 20 లక్షలు లంచం, టెకీ ఆత్మహత్య

రూ.41 లక్షలు సేకరించి..
రిజ్వాన్‌ మొత్తం రూ.41 లక్షల నగదును సేకరించినట్లు విచారణలో అంగీకరించాడు. ఈ డబ్బును అతను అజయ్‌ అరోరా అనే వ్యక్తికి ఇచ్చినట్లు తెలిపాడు. స్కార్పియో, స్కోడా కార్లలో వచ్చిన వ్యక్తుల నుండి డబ్బు సేకరించడానికి.. రిజ్వాన్‌ ఏడుసార్లు అమృత్‌సర్‌ వెళ్లాడు. రిజ్వాన్‌కు తౌరులో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఖాతా, సోహ్నాలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ఖాతా ఉన్నాయి. రిజ్వాన్‌ ల్యాప్‌టాప్, ఫోన్‌లో అనుమానాస్పద లావాదేవీలను దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ కేసులో నుహ్‌ పోలీసు బృందాలు పంజాబ్‌ అంతటా దాడులు నిర్వహిస్తున్నాయి. 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)