Breaking News

ట్విన్స్‌ పుట్టారని సంబరం : అంతలోనే ఊహించని షాక్‌!

Published on Mon, 06/15/2026 - 15:02

ఐవీఎఫ్‌  పేరుతో కొంతమంది వైద్యుల ఆగడాలకు సంబంధించి వెలుగులోకి వచ్చిన కేసు సంచలనం రేపుతోంది. తమకు పుట్టిన పిల్లల డీఎన్‌ఏ మ్యాచ్‌ కాకపోవడంతో గురుగ్రామ్‌కు చెందిన దంపతులు లబోదిబో మన్న వైనం వెలుగులోకి వచ్చింది.

గురుగ్రామ్‌కు చెందిన రాహుల్ రాథోడ్, అతని భార్య మీనూ రాథోడ్ సంతానంకోసం గత ఏడాది ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) పద్ధతిని ఎంచుకున్నారు. జనవరిలో మీనూ ఇద్దరు కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది. అయితే, ఆ పిల్లలు తమ పోలికలతో అస్సలు సరిపోలకపోవడంతో అనుమానం వచ్చి, పిల్లల డీఎన్‌ఏ (DNA) పరీక్ష చేయించాలని నిర్ణయించుకున్నారు. టెస్ట్‌ రిపోర్ట్స్‌లో వారు షాకయ్యే నిజం తెలియడంతో పిల్లలు పుట్టారన్న సంతోషం కాస్తా  పీడకలగా మారిపోయింది. 

మరొక జంటకు చెందిన పిండాన్ని (embryo) మీనూ రాథోడ్ గర్భాశయంలో ప్రవేశపెట్టారని ఆరోపిస్తూ భర్త పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ ఆరోపణపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని ఢిల్లీ కోర్టు స్థానిక పోలీసులను ఆదేశించింది.

ఇదీ చదవండి : విడాకులు మంజూరు : భర్తను వాటేసుకుని ఎమోషనల్‌, ఎందుకో తెలుసా?

ఏం జరిగింది?
ద్వారకాలోని ఒక ఆసుపత్రి తమను  ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్‌లో ఉన్న ఒక ఇన్‌ఫెర్టిలిటీ (సంతానలేమి) క్లినిక్‌కు ఐవీఎఫ్ చికిత్స కోసం పంపిందని, అక్కడ డాక్టర్ శివానీ సచ్‌దేవ్ ఈ కేసును పర్యవేక్షించారని రాహుల్ రాథోడ్ తెలిపారు. గత ఏడాది జనవరి 9న వైద్యులు ఆ మహిళకు ఐవీఎఫ్ సంబంధిత పరీక్షలు నిర్వహించి, భర్త వీర్యం, అండం ఉపయోగించే పిండాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అలా అభివృద్ధి చేశామని చెప్పిన పిండాన్ని మే 14న  మీనూ  గర్భాశయంలో ప్రవేశపెట్టారు. ఫలితంగా ఈ ఏడాది జనవరి 5న ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. అయితే  ట్విన్స్‌ పోలీకలపై అనుమానంతో టెస్ట్‌ చేయించారు. చివరికి వారు అనుమానించినట్టుగానే ఆ పిల్లలు బయోలాజికల్‌గా వారిద్దరికీ పుట్టినవారు కాదని ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్‌లో తేలింది. దీంతో క్లినిక్‌ వాళ్లే ఏదో మాయ చేశారని మండిపడుతున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని రాహుల్ రాథోడ్ డిమాండ్ చేశారు. దర్యాప్తు కోసం ఆసుపత్రిలోని ఐవీఎఫ్ రికార్డులు, పిండానికి సంబంధించిన పత్రాలు, ల్యాబ్ రికార్డులు, ఎలక్ట్రానిక్ డేటా, సీసీటీవీ (CCTV) ఫుటేజీలను భద్రపరచాలని ఆయన కోరారు. తమలాగే ఐవీఎఫ్ క్లినిక్‌ల వల్ల మోసపోయిన పలు దేశాలలోని దంపతులనుండి తనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని మీనూ రాథోడ్ పేర్కొన్నారు. ఈ విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: పోలీసులే నివ్వెరపోయేలా భర్త టార్చర్‌, ఇనుప గొలుసులతోనే స్టేషన్‌కి!

Videos

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)