Breaking News

ప్రభుత్వం నిద్ర పోతుందా? రాజ్‌కోట్‌ ఘటనపై హైకోర్టు సీరియస్‌

Published on Mon, 05/27/2024 - 14:02

గాంధీనగర్‌: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో 33 మంది మృతి చెందారు. మరో 15 మందిపైగా జనం జాడ తెలీడంలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనను సూమోటోగా స్వీకరించిన గుజరాత్‌ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది.

‘‘అంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు మీరు ఎక్కడ నిద్ర పోతున్నారు? మాకు గుజరాత్ ప్రభుత్వంపై మీద ఏ కోశానా కూడా నమ్మకం లేదు’’ అని హైకోర్టు ఆసహనం వ్యక్తం చేసింది. ‘‘ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న రెండు  గేమింగ్‌ జోన్లను గత రెండు దశాబ్దాలుగా రాజ్‌కోట్‌లో నిర్వహింస్తున్నారు. వాటి నిర్వహణకు సంబంధించి ఎటువంటి అనుమతులు లేవు. ఫైర్‌ సేఫ్టీ అనుమతి పత్రాలు కూడా లేవు. అందుకే గుజరాత్‌ ప్రభుత్వం పట్ల కొంచం కూడా నమ్మకం లేదు’’ అని హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

‘‘రెండున్నరేళ్ల నుంచి రాజ్‌కోట్‌ గేమింగ్‌ జోన్ నడుస్తోంది. ప్రభుత్వం కళ్లు ముసుకుందని మేము అనుకోవాలా? అసలు అధికారులు ఏం చేస్తున్నారు?’’ అని హైకోర్టు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. గేమింగ్‌ జోన్‌కు సంబంధించిన ఫొటోలను చూపించిన రాజ్‌కోట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌పై కూడా హైకోర్టు మండిపడింది. ‘‘ఈ అధికారులంతా ఎవరూ? అక్కడికి వారంతా ఆడుకోవడానికి వెళ్లారా?’’ అని కోర్టు విమర్శించింది.  ‘‘అంతపెద్ద ప్రమాదం జరిగినప్పుడు మీకు కంటి చూపు పోయిందా? లేదా నిద్రపోతున్నారా?  ఇంత జరిగాక మాకు స్థానిక వ్యవస్థ, రాష్ట్ర ప్రభుత్వంపై పూర్తిగా నమ్మకం పోయింది’’ అని హైకో​ర్టు రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం​ వ్యక్తం చేసింది.

రాజ్‌కోట్‌లోని మనా-మవా ప్రాంతంలో ఉన్న టీఆర్‌పీ గేమింగ్‌ జోన్‌లో శనివారం ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటివరకు ఈ ఘటనలో 33 మంది మృతి చెందినట్లు  అధికారులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. గేమింగ్‌ జోన్‌లో వెల్డింగ్‌ పనులు జరగుతున్నాయి.  దీంతో అక్కడ ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలిపారు.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)