Breaking News

గోహత్యపై గుజరాత్‌ కోర్టు కీలక వ్యాఖ్యలు

Published on Sun, 01/22/2023 - 20:39

గుజరాత్‌ కోర్టు గో హత్యపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు కోర్టు అక్రమంగా పశువులను రవాణా చేసిన వ్యక్తి కేసును విచారిస్తూ.. ఈ వ్యాఖ్యలు చేసింది. గో హత్య నిలిపేస్తే భూమిపై ఉన్న అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని జిల్లా కోర్టు జడ్జి పేర్కొన్నారు. సదరు వ్యక్తికి జీవిత ఖైదు శిక్ష విధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేస్తూ న్యాయమూర్తి ఈ విషయాలను వెల్లడించారు.

ఈ మేరకు న్యాయమూర్తి మాట్లాడుతూ.. ఆవుపేడతో చేసిన ఇళ్లు రేడియోషిన్‌కి గురికావని సైన్స్‌ రుజువు చేసింది. గోమూత్రం అనేక నయం చేయలేని వ్యాధులకు మందు. ఆవు ఒక జంతువు మాత్రమే కాదని, 68 కోట్ల పవిత్ర స్థలాలకు, 33 కోట్ల దేవతలకు నిలయమని అన్నారు. అందుకు సంబంధించిన శ్లోకాలను ప్రస్తావిస్తూ..ఆవులను హింసిస్తే మన సంపద, ఆస్తులు నశిస్తాయని చెప్పారు.

ప్రస్తుత రోజుల్లో ప్రజలకు కోపం, ఆవేశం వంటివి పెరిగిపోవడానికి గోవధే కారణం. దీనిని పూర్తిగా నిషేధించే వరకు వాతావరణం మార్పులకు(కాలుష్యానికి) గురికాదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, సదరు వ్యక్తిని గతేడాది ఆగస్టులో 16 ఆవులు అక్రమంగా రవాణ చేయడంపై అరెస్టు చేశారు. ఆ వ్యక్తికి కోర్టు జీవిత ఖైదు విధించడమే గాక సుమారు రూ. 5 లక్షల జరిమాన విధించింది. 

(చదవండి: 76 ఏళ్ల క్రితం నాటి రైల్వే టిక్కెట్‌..ధర ఎంతో తెలుసా!)
.

Videos

ఈడీపై సుప్రీం ఆగ్రహం

కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై టీడీపీ సీరియస్ నేతల ఫైర్

మహిళల సింధూరాన్ని చెరిపినవారిని మట్టిలో కలిపేశాం : మోదీ

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)