Breaking News

Bihar Bridge Collapse: కనిపించకుండా పోయిన సెక్యూరిటీ గార్డు..

Published on Mon, 06/05/2023 - 12:48

బిహార్‌లో భాగల్‌పూర్‌లో రూ. 1700 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న తీగల వంతెన ఆదివారం పేకమేడలా కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిహార్‌ రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఈ మేరకు బిహార్‌ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..గతేడాది ఏప్రిల్‌ 30న ఈ వంతెన కొంతభాగం కూలిపోయిందనే విషయాన్ని గుర్తు చేశారు. ఆ తర్వాత దీని నిర్మాణ విషయంపై అధ్యయనం చేయడం కోసం ఐఐటీ రూర్కీ నిపుణలను సంప్రదించాం.

ఇంకా తుది నివేదిక రావాల్సి ఉంది. అధ్యయనం చేసిన నిపుణుల ఈ నిర్మాణంలో కొద్దిపాటి లోపాలున్నాయని మాకు తెలియజేశారు. అందుకు సంబంధించిన వాటినన్నింటిని ​తొలగించాం. అయనప్పటికీ ఆదివారం జరిగిన ఘటన తీవ్ర భయాందోళనలను రేకెత్తిస్తోందని తేజస్వీ యాదవ్‌ అన్నారు. ఈ ‍క్రమంలో ప్రభుత్వాధికారి ఒకరు మాట్లాడుతూ..ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. బాధ్యులైన అధికారులపై తప్పక కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే వంతెన దగ్గర పనిచేస్తున​ సెక్యూరిటీ గార్డు కూడా ఈ ఘటన తర్వాత కనిపించకుండా పోయినట్లు తెలిపారు. రెస్క్యూ అధికారులు అతని ఆచకి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.

బ్రిడ్జి కూలిన తర్వాత నుంచి గార్డు కనిపించ లేదని, అతడి మృతదేహం కోసం ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అతడి ఆచూకి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిపారు. కాగా, బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ రాజీనామా చేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సామ్రాట్‌ చౌదరి డిమాండ్‌ చేశారు. ఆయన పాలనలో జరుగతున్న అవినీతి కారణంగానే ఇలాంటి దుర్ఘటన జరిగిందని ఆరోపణలు చేశారు. మరో సహచర బీజేపీ నాయకుడు సయ్యద్‌ షానవాజ్‌ కూడా ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు. 

(చదవండి: బిహార్‌లో కూలిన తీగల వంతెన)

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)