Breaking News

పెళ్లి మండపానికి సమీపంలో.. ట్రక్కు ఢీకొని వరుడు మృతి

Published on Mon, 11/24/2025 - 13:58

బాగ్‌పత్‌: ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో పెళ్లి వేడుక విషాదకరంగా మారింది. కొద్దిసేపటిలో జరిగే వివాహానికి సిద్ధమవుతున్న వరుడు సుబోధ్ కుమార్ (25) అకాల మృత్యువు బారిన పడ్డాడు. అప్పటివరకూ ఆనందోత్సాహాలతో కళకళలాడిన పెళ్లి వేదికపై విషాదం తాండవించింది. పిచోక్రా గ్రామానికి చెందిన సుబోధ్ కుమార్  బంధువులతో సహా ఆదివారం రాత్రి సరూర్‌పూర్ కలాన్ గ్రామానికి వాహనంలో బయలుదేరాడు.

కొద్దిసేపటికి సుబోధ్‌కు అస్వస్థతగా అనిపించి, వాంతి చేసుకునేందుకు వాహనం నుంచి దిగి రోడ్డు పక్కకు వెళ్లాడు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సుబోధ్ రోడ్డు పక్కన వాంతులు చేసుకుంటున్న సమయంలో ఎదురుగా అత్యంత వేగంగా వచ్చిన ఒక ట్రక్కు అతన్ని ఢీకొని కొన్ని మీటర్ల దూరం వరకూ ఈడ్చుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన సుబోధ్‌ను హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే సుబోధ్‌ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు.

రాత్రి 10:30 గంటల ప్రాంతంలో వరుడిని ఆస్పత్రికి తీసుకువచ్చినట్లు జిల్లా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రాజ్ సింగ్ తెలిపారు. ఈ సంఘటన బినౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ట్రక్ డ్రైవర్‌ను గుర్తించేందుకు అధికారులు హైవేతో పాటు సమీప ప్రాంతాలలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నారు.

ఇది కూడా చదవండి: 25న అయోధ్యలో మరో ఉత్సవం.. ‍ప్రధాని మోదీ హాజరు

#

Tags : 1

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు