Breaking News

వధువుకు యాక్సిడెంట్‌.. ఆస్పత్రి బెడ్‌ మీదే పెళ్లాడిన వరుడు

Published on Mon, 02/20/2023 - 20:08

కొన్ని విచిత్రమైన పెళ్లిళ్లు సినిమాల్లోనే జరుగుతాయి తప్ప రియల్‌ లైఫ్‌లో అసాధ్యం అనిపిస్తాయి. కానీ సాధ్యమే అని నిరూపించాడు ఇక్కడొక వ్యక్తి. అతన్ని చూస్తే ఇంకా మంచి వ్యక్తులు ఉన్నారా అని ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వివరాల్లోకెళ్తే..మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని భేరుఘాట్‌లో నివాసం ఉంటున్న సౌదాసింగ్‌కు కుమారుడు రాజేంద్రకు జుల్వానియా గ్రామానికి చెందిన సుభాష్‌ కుమార్తె శివానితో వివాహం నిశ్చయమైంది. వధువరులిద్దరి బంధువులు ఖాండ్వాలోని భగవాన్‌పురా నివాసితులు కావడంతో ఇరు కుటుంబాల పెద్దలు వివాహ వేడుకను ఖాండ్వాలో నిర్వహించాలని అనుకున్నారు.

ఇంతలో అనుకోకుండా వధువు ప్రమాదం బారిన పడింది. దీంతో ఆమె కాళ్లకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఐతే వరుడు రాజేంద్ర సినిమాలో మాదిరి హిరోలా ఆమెకు అండగా నిలవాలనుకున్నాడు. దీన్ని అపశకునంగా భావించకుండా తమ పెద్దలు అనుక్నున్న ముహుర్తానికే ఆస్పత్రిలోనే ఆమెను పెళ్లిచేసుకున్నాడు. పెళ్లికి ముందు రోజే శివాని కాలికి చేతికి ఆపరేషన్‌ జరగడం గమనార్హం. సాధారణ వార్డును పెళ్లి వేడుకగా మార్చి..పండితుడి సమక్షంలో దండలు మార్చుకుని వివాహం చేసుకున్నారు.

వరుడు తల్లిదండ్రులు  కోడలికి కూతురికి మధ్య ఉన్న అంతరం తోలగించాలనే ఈ పెళ్లిని ఆపకుండా అనుకున్న ముహుర్తానికే జరిపించామని చెప్పారు. అలాగే తమ కూతురికే ఇలాంటి పరిస్థితి ఎదురై పెళ్లి ఆగిపోతే తమకు కూడా అలానే బాధగా ఉంటుందన్నారు. తమ కోడలికి నయం అ‍య్యేంతవరకు ఆస్పత్రిలో చికిత్సను కూడా అందిస్తామని చెప్పారు. ఈ మేరకు పెళ్లి కూతురు తండ్రి మాట్లాడుతూ.."మా కూతురికి మంచి సంబంధం కుదిరింది. అల్లుడు, వారి బంధువులు ఈ పెళ్లికి సహకరించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది." అంటూ ఆనందబాష్పాలతో చెప్పుకొచ్చారు.

(చదవండి: రింగ్‌ మాస్టర్‌కు ఝలక్‌.. నువ్వు లక్కీఫెలో భయ్యా!)

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)