Breaking News

కేంద్రం దౌత్యమార్గం

Published on Sat, 05/17/2025 - 01:14

న్యూఢిల్లీ: ఉగ్రవాదానికి దన్నుగా నిలుస్తున్న పాకిస్తాన్‌ అసలు స్వరూపాన్ని ప్రపంచ దేశాలకు వివరించేందుకు కేంద్రం దౌత్య మార్గాన్ని ఎంచుకుంది. ఇందులో భాగంగా అఖిలపక్ష నేతల బృందాలను వచ్చే వారం నుంచి వివిధ దేశాలకు పంపించాలని నిర్ణయించింది. 

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్‌ 22న తేదీన ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకోవడం, కేంద్రం చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ తదితర పరిణామాలను వివరిస్తూ పాక్‌ వక్రబుద్ధిని విదేశీ ప్రభుత్వాలకు ఈ బృందాలు వివరించనున్నాయి. ఇందులో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు, సీనియర్‌ నేతలుంటారు. బృందాలకు కేంద్ర మాజీ మంత్రులు సారథ్యం వహించనున్నారు. 

ఈ ప్రతిపాదనకు ఇప్పటికే కొన్ని పార్టీలు ఆమోదం తెలిపాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఎన్ని బృందాలుంటాయి, అందులో ఎందుకు సభ్యులుంటారనే దానిపై స్పష్టత రాలేదు. కనీసం 30 మంది ఎంపీలకు భాగస్వామ్యం ఉంటుందని కొందరు నేతలంటున్నారు. బృందాలకు ప్రయాణ ప్రణాళికతోపాటు అవసరమైన సూచనలను విదేశాంగ శాఖ అందించనుంది. 

ఈ బృందాల్లో బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఎన్‌సీపీ(ఎస్‌పీ), జేడీయూ, బీజేడీ, శివసేన(యూబీటీ), సీపీఎం తదితర పార్టీల ఎంపీలుండొచ్చని సమాచారం. ఈ నెల 22, 23వ తేదీల్లో బయలు దేరనున్న ఈ బృందాలు 10 రోజుల్లో వివిధ దేశాలకు వెళ్లనున్నాయి. అధికార బీజేపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి అనురాగ్‌ ఠాకూర్, ఒడిశా బీజేపీ ఎంపీ అపరాజిత సారంగితోపాటు కాంగ్రెస్‌ నుంచి శశి థరూర్‌ సహా నలుగురు ఎంపీలు ఇందులో ఉంటారు. 

ఇందులో కాంగ్రెస్‌ సభ్యుడు సల్మాన్‌ ఖుర్షీద్‌ సారథ్యంలోని ఏడుగురు సభ్యుల బృందం దక్షిణ, వాయవ్య ఆసియాలోని దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్‌ తదితర దేశాలకు వెళ్లనుంది. బారామతి ఎంపీ సుప్రియా సూలే బృందం ఆఫ్రికా, పశ్చిమాసియాలోని ఒమన్, ఈజిప్టు, కెన్యా, దక్షిణాఫ్రికాలకు వెళ్లనుంది. కాంగ్రెస్‌ నేత మనీశ్‌ తివారీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం యూరప్‌ లేదా మధ్యప్రాచ్యానికి వెళ్లే అవకాశముంది.

 అమెరికా వెళ్లే బృందానికి శశిథరూర్‌ నాయకత్వం వహిస్తారు. ప్రతి బృందంలో ఏడెనిమిది మంది సభ్యులుంటారు. వీరు నాలుగు నుంచి ఐదు దేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. బృందాలను పంపించడంపై కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ విషయమై కేంద్ర మంత్రి రిజిజు కాంగ్రెస్‌ చీఫ్‌ ఖర్గేతో మాట్లాడారని ఆ పార్టీ నేత జైరాం రమేశ్‌ వెల్లడించారు.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)