Breaking News

పాకిస్థాన్‌కు భారత్‌ మరో షాక్‌.. ఇకపై అవన్నీ బంద్‌

Published on Thu, 05/08/2025 - 20:26

పాకిస్థాన్‌కు భారత్‌ వరుస షాక్‌లు ఇస్తోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత దాయాది దేశం పాకిస్తాన్‌కు భారత్‌ చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేసిన భారత్‌.. బాగ్‌లిహార్‌ ఆనకట్ట నుంచి కూడా పాక్‌కు నీటి సరఫరాను నిలిపివేసింది. ఇప్పటికే పాకిస్థాన్‌పై పలు ఆంక్షలు విధించగా.. ఆ దేశంపై డిజిటల్‌ యుద్ధం కూడా ప్రారంభించింది. పాకిస్థాన్‌ ఓటీటీ, వెబ్‌సీరీస్‌లు, సినిమా పాటలపై  నిషేధం విధించింది. పాడ్‌కాస్ట్‌లు, మీడియా కంటెంట్‌పై కూడా నిషేధం విధించాలని నిర్ణయించింది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని భారత సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ వెల్లడించింది.

పాక్‌ను అన్ని వైపుల నుంచి భారత్‌ దిగ్బంధిస్తోంది. ముప్పేట దాడి చేసేందుకు ఉన్న ఏ అవకాశాన్నీ విడిచి పెట్టడం లేదు. తాజాగా, వినోద రంగం విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌ వెబ్‌ సిరీస్‌లు, సినిమాలు, పాటలు, పాడ్‌కాస్ట్‌లు సహా మీడియా కంటెంట్‌ ఏదీ కూడా ఇక భారత్‌లో అందుబాటులో ఉండదు. సబ్‌స్క్రిప్షన్‌, సహా ఇతర మార్గాల ద్వారా కంటెంట్‌ పొందుతున్న వారికీ ఇందులో ఏ మినహాయింపు లేదు. ఓటీటీలు పాకిస్థాన్‌ కంటెంట్‌ను భారత్‌లో స్ట్రీమింగ్‌ చేయడానికి వీల్లేదు’ అని కేంద్రం స్పష్టం చేసింది.

కాగా, దేశవ్యాప్తంగా 27 ఎయిర్ పోర్టులను మూసివేశారు. భద్రతా కారణాల దృష్ట్యా విమానాల రాకపోకలు రద్దు చేశారు. ఢిల్లీకి వచ్చే, వెళ్లే 90 విమానాలను రద్దు చేశారు. రద్దయిన విమానాల్లో ఐదు అంతర్జాతీయ విమాన సర్వీసులు ఉన్నాయి.

 


 

 

 

Videos

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)