Breaking News

20 ఏళ్లు పైబడిన వాహనాల రెన్యువల్‌ ఫీజు పెంపు

Published on Sat, 08/23/2025 - 05:32

న్యూఢిల్లీ: 20 ఏళ్లు పైబడిన మోటారు వాహనాల రిజిస్ట్రేషన్‌ రెన్యువల్‌ ఫీజును కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది. తద్వారా ఇటువంటి వాహనాల వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. ఇరవయ్యేళ్లు పైబడిన లైట్‌ మోటారు వెహికల్‌(ఎల్‌ఎంవీ)ల రెన్యువల్‌ ఫీజును ప్రస్తుతమున్న రూ.5 వేల నుంచి రెట్టింపు చేసి రూ.10 వేలకు పెంచింది. 

మోటారు సైకిళ్లకైతే ఈ ఫీజును రూ.వెయ్యి నుంచి రూ.2 వేలకు, త్రీ వీలర్స్, నాలుగు చక్రాల వాహనాలకైతే ఇది రూ.3,500 నుంచి రూ.5,000కు పెంచింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా హైవేల శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దిగుమతి చేసుకున్న టూ–త్రీ వీలర్‌కైతే రెన్యువల్‌ ఫీజు రూ.20వేలు చెల్లించాల్సి ఉంటుంది. నాలుగు లేదా అంతకంటే ఎక్కువ చక్రాలుండే వాహనాల రెన్యువల్‌ ఫీజు రూ.80వేలని కేంద్రం తెలిపింది. ఈ మేరకు ముసాయిదా సవరణను ఫిబ్రవరిలో జారీ చేసిన కేంద్రం, ఈ నెల 21వ తేదీన దీనిని ఆమోదించింది. వాహనాల రిజిస్ట్రేషన్, రెన్యువల్‌ ఫీజును కేంద్రం చివరిగా 2021 అక్టోబర్‌లో పెంచింది. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)