Breaking News

చైనాతో సంధి వేళ సరిహద్దులపై నేపాల్‌ మరో డ్రామా.. భారత్‌ కౌంటర్‌

Published on Thu, 08/21/2025 - 08:16

ఢిల్లీ: భారత్‌- చైనా మధ్య సరిహద్దు వివాదాలు తగ్గించుకుంటున్న క్రమంలో తెరపైకి నేపాల్‌ వచ్చింది. లిపులేఖ్ కనుమ ద్వారా చైనాతో భారత్ సరిహద్దు వాణిజ్యాన్ని తిరిగి ప్రారంభించడంపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నేపాల్‌ అభ్యంతరాలను తోసిపుచ్చింది. ఈ విషయంలో నేపాల్‌ వాదనలు అసమగ్రంగా ఉన్నాయని స్పష్టంచేసింది.

వివరాల ప్రకారం.. భారత్‌- చైనా మధ్య సరిహద్దుల్లో ఘర్షణలను తగ్గించుకునేందుకు ఇరు దేశాలు చర్చల ద్వారా ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో హిమాలయ పర్వత ప్రాంతం ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్‌ ప్రాంతం మీదుగా వాణిజ్య సరిహద్దులను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించుకున్నాయి. దీనిపై నేపాల్‌ అభ్యంతరం తెలిపింది. ఈ క్రమంలో నేపాల్‌ వ్యవహారంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. రణధీర్‌ జైస్వాల్‌ మాట్లాడుతూ.. లిపులేఖ్ కనుమ ద్వారా భారత్, చైనా మధ్య సరిహద్దు వాణిజ్యం 1954లో ప్రారంభమైంది.

దశాబ్దాలుగా వాణిజ్యం కొనసాగుతోంది. ఈ విషయంలో భారత్‌ వైఖరి స్పష్టంగా ఉంది. ప్రాదేశిక వాదనలను ఏకపక్షంగా విస్తరించడం సాధ్యం కాదు. వాణిజ్య మార్గంపై ఖాట్మండు ప్రాదేశిక వాదన అనుకూలమైనది కాదు. చారిత్రక వాస్తవాలు ఆధారంగా లేవు. కోవిడ్, ఇతర పరిణామాల కారణంగా వాణిజ్యానికి ఇటీవల సంవత్సరాల్లో అంతరాయం కలిగింది. ఇప్పుడు దానిని తిరిగి ప్రారంభించడానికి రెండు వైపులా అంగీకారం కుదిరింది. సరిహద్దు సమస్యలను పరిష్కరించడానికి దౌత్యం ద్వారా నేపాల్‌తో నిర్మాణాత్మక పరస్పర చర్యకు భారత్ సిద్ధంగా ఉంది అని స్పష్టం చేశారు.

అయితే నేపాల్ పశ్చిమ సరిహద్దు లింపియాధురలో 56 కిలోమీటర్ల దూరంలో ఉన్న లిపులేఖ్ కనుమ ద్వారా సరిహద్దు వాణిజ్యాన్ని తిరిగి తెరవడానికి భారత్‌, చైనా ఇటీవల అంగీకరించాయి. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూ భారత పర్యటన సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది. లిపులేఖ్, లింపియాధురతో సహా కాలాపానీ ప్రాంతం తమ భూభాగమని భారత్‌ తన వైఖరిని వ్యక్తం చేస్తోంది. కాగా, 1816 సుగౌలి ఒప్పందం ప్రకారం కాలాపానీ, లింపియాధురతో సహా లిపులేఖ్ తమకే చెందుతుందని నేపాల్ వాదిస్తోంది. ఆ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం, రోడ్ల విస్తరణ, సరిహద్దు వాణిజ్యం వంటి ఎటువంటి కార్యకలాపాలను చేపట్టవద్దని నేపాల్ ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని కోరుతోంది. 

Videos

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)