Breaking News

రికార్డులు, ప్రకటనల్లో కులం ప్రస్తావన ఉండరాదు 

Published on Tue, 09/23/2025 - 06:22

లక్నో: పోలీసు రికార్డుల్లో కుల ప్రస్తావన అభ్యంతరకర పరిణామాలకు దారి తీస్తోందంటూ అలహాబాద్‌ హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం తదనుగుణంగా చర్యలకు ఉపక్రమించింది. పోలీసు రికార్డులతోపాటు పబ్లిక్‌ నోటీసుల్లో ఎటువంటి కుల ప్రస్తావన ఉండరాదని స్పష్టం చేసింది. మోటారు వాహనాల చట్టం ప్రకారం వాహనాలపై కులం ఆధారితంగా స్టిక్కర్లు, నినాదాలను ప్రదర్శించరాదని కూడా తెలిపింది. 

ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని పోలీస్‌ స్టేషన్లకు, జిల్లా యంత్రాంగాలకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. కులపరమైన వివక్షను తొలగించాలంటూ ఈ నెల 16వ తేదీన హైకోర్టు వెలువరించిన ఆదేశాల మేరకు ఈ చర్యలను తీసుకుంటున్నట్లు తెలిపింది. పోలీసు రిజిస్టర్లు, కేస్‌ మెమోలు, అరెస్ట్‌ డాక్యుమెంట్లతోపాటు పోలీస్‌ స్టేషన్లలో పెట్టే నోటీస్‌ బోర్డుల్లోనూ కుల ప్రస్తావన ఉండరాదని చీఫ్‌ సెక్రటరీ దీపక్‌ కుమార్‌ ఆ ఉత్తర్వులో తెలిపారు. 

రాష్ట్ర క్రైం అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ అండ్‌ సిస్టమ్స్‌(సీసీటీఎన్‌ఎస్‌) పోర్టల్‌లోనూ కులానికి సంబంధించిన కాలమ్‌ను ఖాళీగా వదిలేయాలన్నారు. పోలీసు రికార్డుల్లో నిందితుల పేర్ల వద్ద తల్లిదండ్రుల ఇద్దరి పేర్లను జత చేయాలన్నారు. వాహనాలపై కులానికి సంబంధించిన స్టిక్కర్లు, నినాదాలను ప్రదర్శించే వారిపై చలాన్లు విధించాలని కూడా ఆయన అధికారులను ఆదేశించారు. పట్టణాలు, గ్రామాల్లో కులాలను గురించి గొప్పగా చెప్పుకుంటూ ఏర్పాటు చేసే బోర్డులను తొలగించాలన్నారు. 

ఈ వీధి లేదా ఈ ప్రాంతం ఫలానా కులానికి చెందినదంటూ బోర్డులను ఏర్పాటు చేయరాదన్నారు. రాజకీయ లాభాపేక్షతో కులం పేరుతో ర్యాలీలు, బహిరంగ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయరాదన్నారు. కులాలను గురించి గొప్పగా చెప్పుకుంటూ సోషల్‌ మీడియాలో వచ్చే కంటెంట్‌పైనా నిఘా ఉంచుతామన్నారు. కులాధారిత శత్రుత్వాన్ని ప్రచారం చేసే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనలకు లోబడి పై ఆదేశాలకు అనుగుణంగా అధికారులు తక్షణమే స్పందించాలని, దిగువ స్థాయి అధికారులకు ఈ విషయంలో తగు శిక్షణను కూడా ఇవ్వాలని పేర్కొన్నారు.   
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)