Breaking News

కేంద్రంపై యూకే రచయిత నిటాషా సంచలన ఆరోపణలు

Published on Mon, 02/26/2024 - 12:57

లండన్‌: భారత సంతతికి చెందిన యూకే ప్రొఫెసర్‌, రచయిత నిటాషా కౌల్‌కు భారత ప్రభుత్వం ఎంట్రీ నిరాకరించింది. కర్ణాటక ప్రభుత్వ ఆహ్వానం మేరకు బెంగళూరు ఎయిర్‌పోర్టులో దిగిన తనను ఇమిగ్రేషన్‌ సిబ్బంది అడ్డుకున్నారని ఆమె తెలిపారు. అనంతరం తిరిగి తనను లండన్‌ పంపేశారని, అడిగితే నీ పర్యటనకు కేంద్ర ప్రభుత్వ అనుమతి లేదని చెప్పారన్నారు. ఈ విషయాలన్నింటిని ఆమె తాజాగా ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు చేశారు.

‘‘ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలు’ అనే అంశంపై మాట్లాడేందుకు కర్ణాటక ప్రభత్వం నన్ను ఆహ్వానించింది. కానీ కేంద్ర ప్రభుత్వం నన్ను ఎయిర్‌పోర్టులోనే ఆపేసి తిరిగి లండన్‌ పంపించివేసింది. నా వద్ద అవసరమైన డాక్యుమెంట్లన్నీ ఉన్నాయి. గతంలో ఆర్‌ఎస్‌ఎస్‌పై విమర్శలు చేసినందుకే నన్ను వెనక్కిపంపుతున్నట్లు అధికారులు అనధికారికంగా నాతో చెప్పారు.

లండన్‌ నుంచి 24 గంటల పాటు ప్రయాణించి బెంగళూరు వస్తే మళ్లీ 24 గంటలు అటు ఇటు తిప్పి నన్ను ఎయిర్‌పోర్టులోనే ఉంచారు. కనీసం ఆహారం, మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. పడుకోవడానికి కొద్దిగా స్థలం చూపించారు. అక్కడ కూడా కనీసం దిండు ఇవ్వలేదు. సీసీ కెమరా పర్యవేక్షణలో ఉంచారు. నేను ఎన్నోసార్లు భారత్‌ వచ్చాను. నాకు దేశంలోకి అనుమతి లేనట్లు కనీసం ముందుగా కూడా చెప్పలేదు. కర్ణాటక ప్రభుత్వమే నాకు టికెట్లు ఇచ్చింది’అని కౌల్‌ ఎక్స్‌లో తెలిపారు.    

ఇదీ చదవండి.. భారత సంతతి కంప్యూటర్‌ ఇంజినీర్‌కు ప్రతిష్టాత్మక అవార్డు 

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)