Breaking News

మంటల్లో చిక్కుకున్న బస్సు..అదే టైంలో కండక్టర్‌ నిద్రిస్తుండటంతో..

Published on Fri, 03/10/2023 - 13:48

బస్టాప్‌ వద్ద పార్క్‌ చేసి ఉన్న ఓ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అదే సమయంలో బస్సులో కండక్టర్‌ నిద్రించగా, బస్టాప్‌లోని రెస్ట్‌రూంలో డ్రైవర్‌ నిద్రించడానికి వెళ్లాడు. దీంతో కండక్టర్‌ ఈ ప్రమాదం బారినపడి..తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే..పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..బెంగుళూరులోని లింగధీరహల్లిలో బెంగళూరు మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌(బీఎంటీసీ) బస్టాండ్‌లో ఆగి ఉన్న బస్సులో  అగ్ని ప్రమాదం జరిగింది. బీఎంటీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో..అదే సమయంలో ఆ బస్సులో కండక్టర్‌ నిద్రపోతున్నాడు. దీంతో అతను మంట్లో చిక్కుకుని..80 శాతం కాలిన గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు.

ఐతే బస్సు డ్రైవర్‌(39) ప్రకాశ్‌ ఆ సమయంలో బస్టాప్‌లోని రెస్ట్‌ రూంలో నిద్రపోవడంతో అతను సురక్షితంగా ఉన్నాడు. అర్థరాత్రి 12 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని ఆర్టీసీ డీసీపీ పేర్కొన్నారు. ఐతే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు అధికారులు. 

(చదవండి: భారతీయులు అలాంటివి అనుమతించరు! సమాచార మంత్రి ఫైర్‌)

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)