Breaking News

30 రోజులు కస్టడీలో ఉంటే.. పీఎం, సీఎంల పదవి పోయినట్లే.. నేడు లోక్‌సభకు కీలక బిల్లు

Published on Wed, 08/20/2025 - 08:02

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో నేడు ఎంతో కీలకం కానుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం లోక్‌సభలో ఎంతో ప్రాధాన్యత కలిగిన మూడు బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. ఇందులో ప్రజాప్రతినిధుల తొలగింపునకు సంబంధించిన బిల్లు ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు.

తీవ్రమైన నేరారోపణలతో అరెస్టయిన ప్రజాప్రతినిధులను పదవుల నుండి తొలగించేలా మార్గం చూపే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రతిపాదిత చట్టం ప్రధాని, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల మంత్రులకు సైతం వర్తిస్తుంది. ఐదేళ్లు, అంతకు మించినకాలం జైలు శిక్ష విధించదగిన నేరానికి సంబంధించి సిట్టింగ్ మంత్రి, ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రిని వరుసగా 30 రోజులు అరెస్టు అయినా లేదా కస్టడీలో ఉన్నా ఒక నెలలోపు వారు తమ పదవిని కోల్పోవలసి ఉంటుందని బిల్లులో పేర్కొన్నారు. అంటే వరుసగా 30 రోజులు కస్టడీలో ఉన్నత పదవుల్లోని వారు ఉంటే వారు 31వ రోజు రాజీనామా చేయాలి లేదా వారు ఆటోమేటిక్‌గా తొలగించబడతారని బిల్లు తెలిపింది.

ఈ బిల్లులో ఏ రకమైన క్రిమినల్ అభియోగాలు ఉన్నాయో ఇంకా వివరించనప్పటికీ, వారిపై ఆరోపించిన నేరానికి కనీసం ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించి ఉండాలి. ఇది హత్య, భారీ అవినీతి వంటి తీవ్రమైన నేరాలను కూడా వర్తిస్తుంది. ఈ  బిల్లుపై ప్రతిపక్ష పార్టీలు ఇంకా స్పందించలేదు. ఈ బిల్లు గురించిన మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 75లో కొత్త 5(A) నిబంధనను ప్రభుత్వం ప్రతిపాదించింది.

దాని ప్రకారం ఎవరైనా మంత్రిపై ఐదేళ్లు, లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధించదగిన నేరం చేశాడనే ఆరోపణ మేరకు అరెస్టు అయితే, లేదా కస్టడీలో ఉంటే, ప్రధానమంత్రి సలహా మేరకు ముప్పై ఒకటో రోజు రాష్ట్రపతి వారిని పదవి నుండి తొలగిస్తారు. ముప్పై ఒకటో రోజులోపు రాష్ట్రపతి ప్రకటించకపోయినా, ఆ తర్వాత వచ్చే రోజు నుండి  ఆటోమేటిక్‌గా వారు తొలగింపబడతారని బిల్లులో ఉంది. కాగా లోక్‌సభలో కేంద్రం  రాజ్యాంగం (130వ సవరణ) బిల్లు, జమ్మూ అండ్ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ(సవరణ) బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వం (సవరణ) బిల్లులను ప్రవేశపెట్టనుంది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)