Breaking News

బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు.. కారు కంటే నడుస్తూ వెళ్లడమే బెటర్‌

Published on Fri, 07/26/2024 - 17:58

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు పేరు చెబితేనే ట్రాఫిక్ సమస్యలు గుర్తుకువస్తాయి. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పిలుచుకునే బెంగళూరులో ఐటీ ఉద్యోగులు భారీగా నివసిస్తుండటంతో బెంగళూరు నగరంలో ట్రాఫిక్ కష్టాలు భరించలేనంత ఉంటుంది.

కిలోమీటర్ దూరం ప్రయాణించాలంటే వాహనాల మధ్య గంటల తరబడి ఇరుక్కుపోవాల్సి ఉంటుంది. రోడ్లపైకి వస్తే తిరిగి ఎప్పుడు ఇంటికి వెళ్తామో కూడా తెలియని పరిస్థితులు బెంగళూరు నగరంలో కనిపిస్తూ ఉంటాయి. ఇక వానకాలం కావడంతో బెంగళూరులో రోడ్లు మరీ దారుణంగా తయారయ్యాయి.

తాజాగా బెంగళూరు ట్రాఫిక్ గురించి గూగుల్ మ్యాప్స్ వెల్లడించిన అంశం ఆసక్తిగా మారింది.  నెట్టింట్లో వైరల్‌గా మారింది. బెంగళూరు రోడ్లపై 6 కిలోమీటర్ల దూరం డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం కంటే, నడస్తూ వెళ్లడం ద్వారా త్వరగా చేరుకోవచ్చట. వి విషయాన్ని ఆయుష్‌ సింగ్‌ అనే వ్యక్తి గూగుల్‌ మ్యాప్‌  స్క్రీన్‌షాట్‌ను ట్విటర్‌లో షేర్ చేశాడు.

ఇందులో బెంగళూరులో కేఆర్ పురం రైల్వే స్టేషన్ నుంచి గరుడాచార్ పాళ్యలోని బ్రిగేడ్ మెట్రోపొలిస్ వరకు ఏదైనా వాహనంలో వెళ్లడానికి 44 నిమిషాల సమయం పడితే, అదే దూరం నడిచి వెళ్లడానికి 42 నిమిషాలు పడుతుందని గూగుల్ మ్యాప్స్ చెబుతోంది. ఇది కేవలం బెంగుళూరులోనే సాద్యమంటూ షేర్‌ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింటా వైరల్‌గా మారింది.

 ఒక్కరోజులోనే మూడు లక్షలకు పైగా లైకులు సంపాదించింది. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. బెంగళూరు భారత్‌కు ట్రాఫిక్‌ రాజధాని అని, ముంబై, ఢిల్లీలో కూడా ఇదే రకమైన ట్రాఫిక్‌ ఉంటుందని చెబుతున్నారు.

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)