Breaking News

ఢిల్లీ మెట్రోలో గోల్డెన్‌ లైన్‌.. 15 స్టేషన్లు, 24 కి.మీ. ప్రయాణం!

Published on Mon, 02/26/2024 - 10:43

ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) తాజాగా మెట్రో ఫేజ్ 4 ప్రాజెక్ట్‌లోని తుగ్లకాబాద్ నుండి ఢిల్లీ ఏరోసిటీ కారిడార్ కలర్ కోడ్‌లో చోటుచేసుకున్న మార్పును ప్రకటించింది. ఇంతకుముందు ఈ లైన్‌ను సిల్వర్ లైన్ అని పిలిచేవారు. ఇకపై ఈ రూట్‌ను గోల్డెన్ లైన్ అని పిలవనున్నారు. విజిబిలిటీ సంబంధిత సమస్య కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 

మీడియాకు అందిన సమాచారం ప్రకారం మెట్రో కోచ్‌లలో వెండి రంగు స్పష్టంగా కనిపించడం లేదు. అందుకే దీనిని గోల్డెన్ లైన్ కారిడార్‌గా మార్చారు. ఇది 23.62 కిలోమీటర్ల విస్తీర్ణంలో, మొత్తం 15 స్టేషన్లను కలిగి ఉంటుంది. ఈ కారిడార్ పనులు వేగంగా జరుగుతున్నాయి. 2025నాటికి  ఇవి పూర్తికావచ్చని అధికారులు చెబుతున్నారు. 

ఫేజ్-4లో గోల్డెన్ లైన్‌తో పాటు మరో రెండు కారిడార్లు కూడా నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో జనక్‌పురి వెస్ట్ నుండి ఆర్‌కే ఆశ్రమం వరకు మెజెంటా లైన్‌ను పొడిగించడం, మజ్లిస్ పార్క్ నుండి మౌజ్‌పూర్ వరకు పింక్ లైన్‌ను పొడిగించడం మొదలైనవి ఉన్నాయి. ఢిల్లీ మెట్రోలోని ఒక్కో కారిడార్‌ను ఒక్కో రంగుతో గుర్తిస్తున్న సంగతి తెలిసిందే. ఎల్లో లైన్ సమయపూర్ బద్లీ నుండి గుర్గావ్ వరకు, బ్లూ లైన్ వైశాలి నుండి ద్వారక వరకు, రెడ్ లైన్ కొత్త బస్టాండ్ నుండి రితాలా వరకు నడుస్తుంది.

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)