Breaking News

బంగారం బుల్లెట్ ర్యాలీ!

Published on Wed, 09/10/2025 - 05:55

న్యూఢిల్లీ: కనకం ‘ల’కారం దాటినా తగ్గేదేలే అంటూ కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తోంది! కొన్నిరోజులుగా రూ. లక్షపైనే కదలాడుతున్న పుత్తడి ఒక్కసారిగా మళ్లీ హైజంప్‌ చేసింది. బంగారం ధర మంగళవారం బుల్లెట్‌లా దూసుకెళ్లింది. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత పసిడి 10 గ్రాముల రేటు ఏకంగా రూ. 5,080 పెరిగి రూ. 1,12,750 స్థాయికి చేరింది. 

దేశీయంగా బంగారానికి ఇది మరో కొత్త ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి. అంతేకాదు.. ఒకేరోజు పసిడి ఇంతలా పెరగడం కూడా ఇదే తొలిసారి కావడం గమనార్హం. వెండి ధర సైతం కిలోకు రూ. 2,800 లాభపడటంతో రూ. 1,28,800 స్థాయిని తాకింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం 3,698 డాలర్ల వద్ద సరికొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. ‘బంగారం మరో రికార్డు స్థాయిని చేరింది. 

ఈ ఏడాది ఎప్పటికప్పుడు కొత్త గరిష్టాలు నమోదు చేస్తూ అంతర్జాతీయ మార్కెట్లో 35 శాతం పెరిగింది. సెంట్రల్‌ బ్యాంక్‌ల నుంచి బలమైన డిమాండ్‌కు తోడు ఎక్స్చేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌)లోకి పెట్టుబడుల రాక, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల కోత అంచనాలు.. బంగారం, వెండిలో రికార్డు బ్రేకింగ్‌ ర్యాలీకి కారణమవుతున్నాయి’అని హెచ్‌డీఎఫ్‌సీ కమోడిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ సౌమిల్‌ గాంధీ తెలిపారు. 


భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతుండటం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ టారిఫ్‌ వార్‌ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయన్న ఆందోళనలు సైతం సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే బంగారం ధరలకు మద్దతుగా నిలుస్తున్నట్టు గాంధీ వివరించారు.  

#

Tags : 1

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)