తులం బంగారం రూ. 113 మాత్రమే *

Published on Sun, 08/04/2024 - 11:46

మనదేశంలో పెళ్లిళ్లు, వేడుకలు, అక్షయతృతీయ, వరలక్ష్మీ వ్రతం లాంటి సందర్భాల్లో బంగారం కొనుగోలుకు అధిక డిమాండ్‌ ఉంటుంది. గతంతో పోలిస్తే బంగారం ధర భారీగా పెరిగినప్పటికీ, చాలామంది దానిని కొనుగోలు చేసేందుకు ఏమాత్రం వెనుకాడరు.  

అయితే ఒకప్పుడు 11.66(తులం) గ్రాముల బంగారం ధర కేవలం రూ.113 అని  తెలిస్తే ఎవరికైనా ఆ కాలానికి తిరిగి వెళ్లాలనిపిస్తుంది. అయితే బంగారం ధర చాలా తక్కువగా ఉన్న కాలంలో ప్రజల ఆదాయం కూడా చాలా పరిమితంగానే ఉండేది. బంగారం కొనుగోలుకు సంబంధించిన  పాత రసీదు ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ రసీదులో 11.66 గ్రాముల బంగారం ధర రూ.113 అని ఉంది. ఈ బిల్లు 1959 నాటిది.

ప్రస్తుతం తులం బంగారం ధర రూ.70 నుంచి 75 వేలుగా ఉందని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ పాత బిల్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. దీనిని చూసిన యూజర్స్‌ తెగ ఆశ్చర్యపోతున్నారు. ‘జిందగీ గుల్జార్ హై’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ బిల్లు ఫొటోను షేర్‌ చేశారు. ఈ పోస్ట్‌ను ఇప్పటివరకు 69 వేల మందికి పైగా లైక్ చేశారు. అలాగే పలువురు తమ కామెంట్లు పెడుతున్నారు. ఒక యూజర్‌ ‘సమయం వేగంగా కదులుతోంది’అని రాయగా, మరొక యూజర్‌ ‘నాటి ఆదాయాల ప్రకారం చూస్తే బంగారం ఎంతో ఖరీదైనది’ అని రాశారు. ఇంకో యూజర్‌ ‘అప్పట్లో చాలామంది జీతం నెలకు 40 రూపాయలు’ అని రాశారు. 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)