Breaking News

Global Buddhist Summit: భవ్య ప్రగతికి బుద్ధుని బోధనలే మార్గదర్శకాలు

Published on Fri, 04/21/2023 - 04:42

న్యూఢిల్లీ: గౌతమ బుద్ధుని బోధనలను ఆచరించి సుస్థిరాభివృద్ధిని సాధించవచ్చని ప్రధాని మోదీ అభిలషించారు. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు బుద్ధుడి బోధనలు చక్కని పరిష్కారాలు చూపగలవని మోదీ వ్యాఖ్యానించారు. గురువారం ఢిల్లీలో గ్లోబల్‌ బుద్ధిస్ట్‌ సమ్మిట్‌ సెషన్‌లో మోదీ ప్రారంభోపన్యాసం చేశారు. ‘ యుద్ధాలు, ఆర్థిక అస్థిరత, ఉగ్రవాదం, మత అతివాదం, వాతావరణ మార్పులు.. ఇలా ఎన్నో అంతర్జాతీయ సమస్యలు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్నాయి.

వీటికి గౌతముని సద్గుణ బోధనలు పరిష్కార మార్గాలు చూపుతాయి’ అని అన్నారు. పర్యావరణ మార్పు సమస్యకు సంపన్న దేశాలే కారణమంటూ విమర్శించారు. బుద్ధుడు చూపిన మార్గం భవిష్యత్, సుస్థిర పథం. గతంలోనే ఆయన చూపిన మార్గంలో వెళ్లిఉంటే ఇప్పుడీ ప్రపంచానికి ప్రకృతి విపత్తులు దాపురించేవే కాదు. సంకుచిత భావన నుంచి విస్తృత సమ్మిళిత ప్రపంచ భావన దిశగా మళ్లడం అత్యావశ్యకం.   

బుద్ధుని నుంచే భారత్‌ స్ఫూర్తి
గౌతముడి ఉపదేశాలను భారత్‌ ఆచరిస్తోంది. పెను భూకంపంతో కుప్పకూలిన తుర్కియేసహా పలు దేశాలకు ఆపన్నహస్తం అందించింది. బుద్ధుడు చూపిన మార్గాన్ని అనుసరించడమంటే సమస్యల నుంచి సమాధానం వైపునకు పయనించడమే’ అని అన్నారు. సదస్సుకు 30 దేశాల నుంచి బౌద్ధ సన్యాసులు తదితరులు వచ్చారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)