Breaking News

వైరల్‌ వీడియో.. షాపులో ఆ బాలిక చేసిన పనికి అంతా షాక్‌!

Published on Sun, 05/04/2025 - 16:11

హాపూర్: ఉత్తరప్రదేశ్‌లో ఓ షాకింగ్‌ ఘటనకు సంబంధించి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ షాపు యజమానిపై 15 ఏళ్ల బాలిక బ్లేడ్‌తో దాడి చేయడం కలకలం సృష్టించింది.. షాప్​లో కొన్న వస్తువులను వెనక్కి ఇచ్చేందుకు ఆ బాలిక వెళ్లగా, వాటిని తీసుకునేందుకు ఆ దుకాణదారులడు నిరాకరించాడు. దీంతో కోపంతో బాలిక దాడికి పాల్పడింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు షాప్​లోని సీసీటీవీ కెమెరాకు చిక్కాగా.. ఆ దృశ్యాలు ఇప్పుడు వైరల్​గా మారాయి. ఈ ఘటన యూపీలోని హాపూర్​ జిల్లాలో శుక్రవారం జరిగింది.

ఆ షాపు యజమాని స్థానిక మీడియాతో మాట్లాడుతూ, ఆ బాలిక తరచూ వస్తువులు కొనుగోలు చేస్తుందని.. అయితే.. వాడిన వస్తువులను తిరిగి ఇచ్చేస్తోందని.. అనేకసార్లు వాటిని వెనక్కి తీసుకున్నానంటూ ఆయన చెప్పుకొచ్చాడు. అయితే బాలిక ప్రవర్తనతో విసిగిపోయిన అతను ఈసారి వాటిని వెనక్కి తీసుకునేందుకు నిరాకరించానని తెలిపారు.

ఆ బాలిక బ్లేడ్‌తో దుకాణదారుడిపై దాడి చేయగా.. ఆయన చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన జరిగిన సమయంలో దుకాణంలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. వెంటనే అప్రమత్తమై వారు ఆ దుకాణదారుడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా, దుకాణదారుడిపై దాడి చేసిన తర్వాత బాలిక పారిపోయేందుకు ప్రయత్నించగా.. స్థానికులు ఆ బాలికను పట్టుకున్నారు. అయితే గత కొంతకాలంగా ఆ బాలిక మానసిక స్థితి సరిగా లేదని స్థానికులు అంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

 

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)