Breaking News

వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి

Published on Sun, 02/25/2024 - 07:10

దేశ రాజధాని ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ ప్రాంతంలో మూడు, నాలుగు వీధి కుక్కలు ఏడాదిన్నర బాలికను బలిగొన్నాయి. చుట్టుపక్కలవారు రక్షించే సమయానికే ఆ బాలిక తీవ్రంగా గాయపడింది. కుటుంబసభ్యులు బాధిత బాలికను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఆ చిన్నారి మృతి చెందిందని నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత బాలికను దివాన్షిగా గుర్తించారు.

మృతురాలు దివాన్షి తుగ్లక్ లేన్‌లోని చమన్ ఘాట్ ప్రాంతంలో తన కుటుంబంతోపాటు ఉంటోంది. బాలిక తండ్రి రాహుల్ దుస్తులను ఇస్త్రీ చేస్తుంటాడు. ఈ ప్రాంతంలో వీధి కుక్కలు విపరీతంగా సంచరిస్తుంటాయని రాహుల్‌ సన్నిహితుడు వివేక్ కుమార్ తెలిపాడు. రాత్రి భోజనం చేశాక రాహుల్‌ కుటుంబ సభ్యులు బయటకు వచ్చారు. వారికి తమ కుమార్తె కనిపించలేదు. ఇంటికి కొంత దూరంలో రక్తపుమడుగులో ఆ చిన్నారి కనిపించింది. ఆ సమయంలో చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేస్తున్నాయి. 

ఘటనాస్థలికి సమీపంలో డీజే ప్లే అవుతున్నదని స్థానికులు తెలిపారు. ఆ సందడిలో చిన్నారి ఆర్తనాదాలు ఎవరికీ వినిపించలేదు. చివరికి చుట్టుపక్కలవారు ఎలాగోలా కుక్కల బారి నుంచి ఆ చిన్నారికి విముక్తి కల్పించారు. విషయం తెలుసుకున్న జనం అక్కడ పెద్ద ఎత్తున గుమిగూడారు. ఇంతలో ఈ ఘటనపై ఎవరో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రజలను శాంతింపజేసి, బాధిత బాలికను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆ చిన్నారి మృతి చెందిందని నిర్ధారించారు.

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)