Breaking News

పాకిస్థాన్‌కు పంపండి.. ప్రియుని కోసం బాలిక బిగ్ స్కెచ్‌..! ఆ తర్వాత..

Published on Sat, 07/29/2023 - 15:48

జైపూర్‌: పాకిస్థాన్‌కి పంపించండి అంటూ వచ్చిన ఓ మైనర్‌ బాలిక జైపూర్‌ ఎయిర్‌పోర్టులో అధికారులను షాక్‌కు గురిచేసింది. పాక్‌లో ఉ‍న్న తమ ప్రియున్ని కలవడానికి వెళ్తున్నట్లు బాలిక చెప్పుకొచ్చింది. ఎలాంటి పాస్‌పోర్టు, వీసాగానీ లేకుండానే ఎయిర్‌పోర్టుకు వచ్చిన బాలికను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

మూడేళ్ల క్రితమే వచ్చా..
ఎయిర్‌పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన బాలిక పాకిస్థాన్‌కు టిక్కెట్టు అడిగింది. అనుమానంతో విచారించగా.. మూడేళ్ల క్రితమే ఇస్లామాబాద్‌ నుంచి భారత్‌కు వచ్చినట్లు కట్టుకథను చెప్పింది. తన ఆంటీతో పాటే వచ్చినట్లు పేర్కొంది. ప్రస్తుతం వారితో సఖ్యతలేదని తెలిపిన బాలిక.. మళ్లీ పాకిస్థాన్‌కు వెళ్లాలని భావిస్తున్నట్లు చెప్పింది. కానీ దర్యాప్తులో తేలిన విషయాలు చూసి అధికారులు షాక్‌కు గురయ్యారు.

ఎయిర్‌పోర్టులో మైనర్ బాలికను అదుపులోకి తీసుకున్నాం. తన ప్రియున్ని కలవడానికి లాహోర్‌కు వెళ్లాలని చెప్పింది. ఎయిర్‌పోర్టులోని టిక్కెట్‌ కౌంటర్ వద్దకు వచ్చి పాకిస్థాన్‌కు టిక్కెట్టు ఇవ్వమని అడిగినప్పుడు అందరం షాక్‌గు గురయ్యాం. బాలిక మొదట జోక్ చేస్తోందని టికెట్ మాస్టర్‌, సెక్యూరిటీ అధికారులు అనుకున్నారు. కానీ అది నిజమని తెలిసి ఆశ్చర్యపోయాం.' అని అధికారులు తెలిపారు.  

ప్లాన్ ఇచ్చింది ఆయనే..
పాకిస్థాన్‌లో ఉన్న బాలుడు కొన్ని విషయాలు తెలిపినట్లు బాలిక దర్యాప్తులో అధికారులకు చెప్పింది. పాకిస్థాన్‌కు రావడానికి పాటించాల్సిన నియమాలను ఆ బాలుడు చెప్పినట్లు తెలిపింది. అధికారులతో మాట‍్లడేప్పుడు కొన్ని విషయాలు మైండ్‌లో పెట్టుకోవాలని ఆ బాలుడే తెలిపినట్లు వెల్లడించింది. అందుకు భాగంగానే ఆ కట్టుకథను అధికారులకు చెప్పినట్లు పేర్కొంది.

 కానీ దర్యాప్తులో బాలిక స్థానికంగా రాజస్థాన్‌లోని సికార్‌ జిల్లాలోని రత్నపుర గ్రామానికి చెందినదని అధికారులు గుర్తించారు. చివరికి తల్లిదండ్రులను పిలిచి వారి ముందే మళ్లీ ప్రశ్నించగా.. అందరూ గుర్తించాలని ఇలా చేశానని బాలిక చెప్పుకొచ్చింది. దీంతో తల్లిదండ్రులతో పాటే బాలికను ఇంటికి పంపించారు.  

ఇదీ చదవండి: కేరళ గవర్నర్ కాన్వాయ్‌లోకి దూసుకొచ్చిన కారు..

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)