Breaking News

చిటపట చినుకుల్లో అమ్మాయి ‘క్రేజీ’ స్టంట్‌, చివరకు..

Published on Fri, 08/08/2025 - 15:59

‘‘స్మార్ట్‌ ఫోన్‌ చేతిలో ఉంది. ఏదో ఒక వీడియో క్రేజీగా చేసేద్దాం. వీలైతే వైరల్‌ అయిపోదాం’’ అనే ఆలోచనకు వయసు నిమిత్తం లేకుండా పోతోంది. చిన్నపిల్లాడి దగ్గరి నుంచి పండు ముసలిదాకా.. ఏదో ఒక వీడియోతో ఓవర్‌నైట్‌లో ఫేమ్‌ అయిపోవడం(ఆ ఒక్క వీడియోతోనే) చూస్తున్నాం కూడా. అలా.. ఇక్కడ ఓ అమ్మాయి అనుకుంది. కానీ, ఆ ఆలోచన బెడిసి కొట్టింది.

జోరుగా వాన పడుతోంది. ఆ వానలో ఓ అమ్మాయి సరదాగా రీల్‌ చేయాలని అనుకుంది. అయితే కారెక్కి కూర్చుని చేస్తే క్రేజీగా ఉంటుందని భావించింది. ఆమె స్నేహితుడు వాహనం నడుపుతుంటే.. ఆమె ఆ వాహనం టాప్‌ మీద కూర్చుని వానలో ఫోన్‌లో సెల్ఫీలు దిగుతూ మురిసిపోయింది. ఆ డేంజరస్‌ స్టంట్‌ను ఆ దారినపోయే కొందరు వీడియో తీశారు. దానిని నెట్టింట వదిలారు అంతే..

గురుగ్రామ్‌ పోలీసులు ఆ వీడియోకు స్పందించారు. జాతీయ హైవే 48 మీద ఆ ఘటన జరిగిందని నిర్ధారించుకున్నారు. ట్రాఫిక్‌ రూల్స్‌ ఉల్లంఘించినందుకు గురువారం కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఆ రీల్‌ స్టంట్‌ కోసం వాడిన వాహనాన్ని సీజ్‌ చేశారు. తనకు తెలియకుండా తన కొడుకు తన కారును తీసుకెళ్లాడని ఆ తండ్రి చెబుతున్నాడు. కారు నడిపిన ఆ యువకుడు, పైన కూర్చున్న అమ్మాయి ఇద్దరూ పరారీలో ఉ‍న్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరలో వాళ్లను అరెస్ట్‌ చేస్తామని పోలీసులు చెబుతున్నారు. 

ఇలాంటి ప్రమాదకరమైన వీడియోలతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతారో తెలియదుగానీ.. కటకటాలు మాత్రం లెక్కించాల్సి వస్తోందని పలువురు కామెంట్లు పెడుతున్నారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)