Breaking News

మారువేషంలో ఆ ఎంపీ! ఏం చేశాడంటే..

Published on Mon, 01/12/2026 - 12:32

ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు కొంతమంది మంచి రాజులు మారువేషాలేసుకుని నగర వీధుల్లో తిరిగేవారట!. రాజులు లేరు.. రాజరికం పోయింది. ప్రజాస్వామ్యం వచ్చింది. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు మారువేషాలు వేసుకునే ప్రజాప్రతినిధులు అరుదైపోతున్న ఈ కాలంలో ఒక ఎంపీ ఆ దిశగా ఒక అడుగు వేశారు. దేశంలో కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న గిగ్‌ వర్కర్ల అసలు కష్టాలేమిటో అర్థం చేసుకునేందుకు తానూ రోజుపాటు ఆ పని చేశారు. ఎవరా ఎంపీ.. ఏమా కథ?.. 

రాఘవ్‌ చద్దా.. గిగ్‌ కార్మికుల హక్కులపై ఈ మధ్యకాలంలో గళం వినిపిస్తున్న ఏకైక ఎంపీ.  క్విక్‌ కామర్స్‌ (Quick commerce) సంస్థల 10 నిమిషాల డెలివరీ వ్యవస్థతో మనుషుల ప్రాణాలు పోతున్నాయని.. అలాంటిదాన్ని పూర్తిగా నిషేధించాలని మొన్నీమధ్యే రాజ్యసభలోనూ ఆయన మాట్లాడారు. ఆ సమయంలో.. ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అయిన బ్లింకెట్‌ డెలివరీ బాయ్‌ ఒక్కరోజు సంపాదనను ప్రముఖంగా ప్రస్తావించారాయన. అంతేకాదు.. ఆ డెలివరీ బాయ్‌ వివరాలు కనుక్కుని, తన వద్దకు రప్పించుకుని ఆతిథ్యం కూడా ఇచ్చి పంపించారు. 

ఇప్పుడ మరో అడుగు ముందుకేశారు. గిగ్‌ కార్మికుల కష్టాలు తెలుసుకునేందుకు వేషం మార్చారు. బ్లింకెట్‌ డెలివరీ ఏజెంట్‌తో కలిసి ఆ అనుభవం ఏంటో చవిచూశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన తన సోషల్‌ మీడియా ఖాతాలో పోస్ట్‌ చేశారు. అఫ్‌కోర్స్‌.. ఈ చర్యను కూడా విమర్శించేవాళ్లు లేకపోలేదు. ఇది ఢిల్లీలో చేశారా? పంజాబ్‌లో చేశారా?(ఆయన పంజాబ్‌ కోటాలో రాజ్యసభ ఎంపీ అయ్యారని) అంటూ సెటైర్లు వేస్తున్నారు. అలాగే ఆయన చర్యను మెచ్చుకునేవాళ్లు కూడా కనిపిస్తున్నారు. అయితే.. ఆ పనిలో అనుభవమేంటో ఆయన ఇంకా వివరించాల్సి ఉంది.

‘‘గిగ్‌ కార్మికులు రోబోలు కాదు. ఈ విషయంపై సభ ఆలోచన చేయాలి. 10 నిమిషాల్లో డెలివరీ అనేది క్రూరత్వం. ఈ పద్ధతికి ముగింపు పలకాలి. వేగంగా సేవలు అందుతున్నాయని వినియోగదారులు ఆశిస్తున్నప్పటికీ.. గిగ్‌ కార్మికుల సంక్షేమం గురించి చట్టసభ ఆలోచించాలి. రేటింగ్‌ తగ్గించడం, ప్రోత్సాహకాల్లో కోత, ఐడీ బ్లాక్‌ వంటి భయాలతో నిర్దిష్ట సమయంలో డెలివరీ చేసేందుకు కార్మికులు (Gig Workers) వేగంగా, సిగ్నల్స్‌ జంప్‌ చేస్తూ వెళ్లాల్సి వస్తోంది. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. వీటితోపాటు కస్టమర్ల వేధింపులు, ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేయాల్సి రావడం వంటి సవాళ్లు ఎదుర్కొంటున్నారు. గిగ్‌ కార్మికులు భారత ఆర్థిక వ్యవస్థకు కనిపించని చక్రాలు. కానీ వాళ్ల పరిస్థితి రోజువారీ కూలీల కంటే దారుణంగా ఉంటోంది

:::రాజ్యసభలో రాఘవ్‌ చద్దా

Videos

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

అర్హులకు అన్యాయం.. నకిలీలకు ఉద్యోగాలా?

ఎమ్మెల్యే కూన రవి సంతకాలు చేసిన వారికే టీచర్ ఉద్యోగాలు

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు