Breaking News

పెరిగిన గ్యాస్ ధరలు.. డొమెస్టిక్ సిలిండర్ ఎంతంటే?

Published on Sat, 03/07/2026 - 07:01

పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం భారత్‌పై పడింది. దీంతో వంటగ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. డొమెస్టిక్ సిలిండర్‌పై రూ.60 పెంపు జరగగా వాణిజ్య సిలిండర్‌పై రూ. 115 పెరిగింది. ఈ ధరలు తక్షణమే అమలులోకి వస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే కేంద్ర ప్రభుత్వ పథకం  ఉజ్వల  ద్వారా అందించే సిలిండర్ ధరలు మాత్రం యథాతథంగా ఉండనున్నట్లు తెలిపింది.

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది.  దీంతో చమురు రవాణా చేసే నౌకలు నిలిచిపోయాయి. ఈ ప్రభావంతో  చమురు ధరలు పెరిగాయి. ఈ ధరలతో హైదరాబాద్‌లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 965కు చేరుకుంది. 

ఢిల్లీలో డొమెస్టిక్ ధర ప్రస్తుతం రూ. 913 ఉండగా, ముంబైలో రూ. 852 చెన్నైలో రూ.928 కి చేరుకుంది. అయితే యుద్ధప్రభావంతో భవిష్యత్తులో కొరత ఏర్పడకుండా  ఉండేందుకు చమురు ఉత్పత్తులను భారీగా పెంచాలని కేంద్రం ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే భారత్ వద్ద తాత్కాలికంగా చమురు నిల్వలు ఉన్నాయని పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇది వరకే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.

 

Videos

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)