ఐరాస భద్రతా మండలిలో భారత్‌.. సభ్యదేశాలదే తుది నిర్ణయం

Published on Sat, 09/09/2023 - 06:32

న్యూఢిల్లీ: ప్రపంచంలో సిసలైన దేశం అంటూ ఏదైనా ఉందంటే అది భారతదేశమేనని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ వ్యాఖ్యానించారు. ఇండియాను ‘విశ్వ దేశం(కంట్రీ ఆఫ్‌ ది వరల్డ్‌)’గా అభివరి్ణంచారు. జీ20 సదస్సులో పాల్గొనేందుకు శుక్రవారం ఆయన ఢిల్లీ చేరుకున్నారు. ‘ అంతర్జాతీయంగా బహుళపక్ష వ్యవస్థలో భారత అత్యంత ముఖ్యమైన భాగస్వామి. అయితే ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇచ్చే ప్రక్రియలో నా పాత్ర ఏమీ లేదు.

సభ్య దేశాలదే తుదినిర్ణయం’ అని గుటెరస్‌ స్పష్టంచేశారు. ‘ఐరాస భద్రతా మండలిలో, బహుపాక్షిక వ్యవస్థల్లో సంస్కరణలు తప్పనిసరి. అంతర్జాతీయ ఆర్థిక మౌలికస్వరూపం సైతం పాతదైపోయింది. ఇందులోనూ నిర్మాణాత్మకమైన సంస్కరణలు జరగాలి. అంతర్జాతీయ వ్యవస్థలు పారదర్శకంగా ఉండాలి. అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలను అవి తీర్చాలి. యుద్ధాలు, సంక్షోభాలతో కాలాన్ని వృధా చేసుకోకూడదు. ఓవైపు పేదరికం, ఆకలి, అసమానతలు పెరుగుతుంటే మరోవైపు సహానుభూతి, సంఘీభావం తెలిపే గుణం తగ్గిపోతున్నాయి.

మంచి కోసం అందరం కలిసికట్టుగా ముందడుగువేద్దాం’ అంటూ జీ20 దేశాలను గుటెరస్‌ కోరారు. సమీప భవిష్యత్తులో ఉక్రెయిన్‌– రష్యా శాంతి ఒప్పందం వాస్తరూపం దాలుస్తుందన్న నమ్మకం తనకు లేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ప్రపంచం కోరుకునే గణనీయమైన మార్పుల సాధనకు భారత జీ20 సారథ్యం సాయపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ‘ ప్రపంచం ఒక వసుధైక కుటుంబంలా మనగలగాలంటే ముందుగా మనం ఒక్కటిగా నిలుద్దాం. ప్రపంచం ఇప్పుడు కీలకమైన మార్పు దశలో ఉంది. భవిష్యత్‌ అంతా భిన్న ధ్రువ ప్రపంచానిదే’ అని ఆయన  వ్యాఖ్యానించారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)